Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya6b96fa31-ea2e-442a-889a-eacb474fca40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya6b96fa31-ea2e-442a-889a-eacb474fca40-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి మధ్య బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు టఫ్ ఫైట్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక పండుగలప్పుడు లేదంటే వరుసగా హాలిడేస్ వచ్చినప్పుడు.. ఇక స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలను ఇలా ఒకేసారి విడుదలై బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. ఇలా విడుదలైనప్పుడు ఒక్కోసారి రెండు సినిమాలు హిట్ అయితే ఇంకొన్నిసార్లు మాత్రం ఏదో ఒక హీరో సినిమా పైచేయి సాధిస్తూ ఉంటుంది. కానీ బాలకృషBalayya{#}Nippu Ravva;Love Story;Bangaru Bullodu;Fire;court;Balakrishna;september;ravi anchor;Hero;Cinema;goldఒకేరోజు విడుదలై.. బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డ బాలకృష్ణ సినిమాలు ఇవే?ఒకేరోజు విడుదలై.. బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డ బాలకృష్ణ సినిమాలు ఇవే?Balayya{#}Nippu Ravva;Love Story;Bangaru Bullodu;Fire;court;Balakrishna;september;ravi anchor;Hero;Cinema;goldMon, 15 Apr 2024 22:00:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి మధ్య బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు టఫ్ ఫైట్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక పండుగలప్పుడు లేదంటే వరుసగా హాలిడేస్ వచ్చినప్పుడు.. ఇక స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలను ఇలా ఒకేసారి విడుదలై బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం.


 ఇలా విడుదలైనప్పుడు ఒక్కోసారి రెండు సినిమాలు హిట్ అయితే ఇంకొన్నిసార్లు మాత్రం ఏదో ఒక హీరో సినిమా పైచేయి సాధిస్తూ ఉంటుంది. కానీ బాలకృష్ణ కెరియర్ లో మాత్రం ఒక అరుదైన రికార్డు ఉంది. ఇతర హీరోలతో పోటీ పడటం కాదు తనతో తానే బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాడు బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి. బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు 1993 సెప్టెంబర్ 3న ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి  ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో  బంగారు బుల్లోడు సినిమా వస్తే.. బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్  గా  నిప్పురవ్వ సినిమా వచ్చింది. కాగా బంగారు బుల్లోడుకి రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా.. నిప్పురవ్వ సినిమాకి కోదండరామిరెడ్డి దర్శకుడు.


 అయితే ఈ రెండు సినిమాలను ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ అనుకోలేదట. నిప్పురవ్వ షూటింగ్లో ప్రమాదం జరగడం కారణంగా ముందు అనుకున్న తేదీకి రిలీజ్ చేయలేకపోయారు   ఏకంగా గనుల బ్యాక్ డ్రాప్లో సీన్స్ చిత్రీకరిస్తుండగా.. ప్రమాదం జరిగి ముగ్గురు యూనిట్ సభ్యులు మృత్యువాత పడ్డారు. దీంతో ఏడాది పాటు సినిమా షూటింగ్ నిలిచిపోయింది. కోర్టు కేసులు కూడా సినిమాని చుట్టూ ముట్టాయి. తర్వాత గొడవలన్నీ సమసి పోయిన తర్వాత ఇక బంగారు బుల్లోడుతో పాటు ఒకే రోజు నిప్పురవ్వ కూడా రిలీజ్ అయింది. నిప్పు రవ్వ  సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకోగా .. బంగారు బుల్లోడు సూపర్ హిట్ అయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>