PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/public-sentiment-risking-leader-safetycca2f63d-17c9-43df-9e3b-77f3215c1eb7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/public-sentiment-risking-leader-safetycca2f63d-17c9-43df-9e3b-77f3215c1eb7-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడి గురించి అన్ని రాజకీయ పార్టీల నేతలు స్పందించారు. కొంతమంది నేతలు పాజిటివ్ గా రియాక్ట్ అయితే మరి కొందరు నేతలు మాత్రం నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అయితే ఈ దాడి ఘటన గురించి జగన్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే సీఎం జగన్ మౌనం వెనుక అసలు వ్యూహం మాత్రం వేరే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. jagan{#}Nijam;bus;News;Party;Jagan;YCP;CMరాయి ఎటాక్ : దాడి ఘటనపై ఆరోపణలు చేయని సీఎం జగన్.. మౌనం వెనుక వ్యూహమిదే!రాయి ఎటాక్ : దాడి ఘటనపై ఆరోపణలు చేయని సీఎం జగన్.. మౌనం వెనుక వ్యూహమిదే!jagan{#}Nijam;bus;News;Party;Jagan;YCP;CMMon, 15 Apr 2024 09:05:00 GMTఏపీ సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడి గురించి అన్ని రాజకీయ పార్టీల నేతలు స్పందించారు. కొంతమంది నేతలు పాజిటివ్ గా రియాక్ట్ అయితే మరి కొందరు నేతలు మాత్రం నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అయితే ఈ దాడి ఘటన గురించి జగన్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే సీఎం జగన్ మౌనం వెనుక అసలు వ్యూహం మాత్రం వేరే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
జగన్ ఏ పార్టీపై అయినా అనుమానాలు వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తే మాత్రం వైసీపీ అభిమానులు ఆ పార్టీ నేతలను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దాడి చేసిన వ్యక్తి ఎవరు? ఎందుకు చేశారు? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు సరైన సమాధానాలు లభించలేదనే సంగతి తెలిసిందే. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మాత్రం రైట్ కాదని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
 
తాను ఆరోపణలు చేసి ఆ ఆరోపణలు నిజం కాదని తెలిస్తే ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందనే భయం కూడా సీఎం జగన్ లో ఉందని సమాచారం అందుతోంది. నెగిటివ్ గా జరిగిన ఘటనను సైతం పాజిటివ్ గా మార్చుకునేలా జగన్ ప్లాన్స్ ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలంటే ఈ ఘటన విషయంలో వీలైనంత తక్కువగానే మాట్లాడితే మంచిదని సీఎం జగన్ ఫిక్స్ అయ్యారట.
 
మెజారిటీ సర్వేలు వైసీపీకే అనుకూలంగా ఉన్నా ఓటర్ల  నాడి సర్వేలు కచ్చితంగా అంచనా వేయలేవని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. త్వరలో వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించిన తర్వాత ఓటర్లలో వైసీపీకి మద్దతు మరింత పెరుగుతుందని జగన్ ప్లాన్ అని తెలుస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల్లో స్పందన భారీ స్థాయిలో ఉండటంతో బొటాబొటీ మెజార్టీతో రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>