PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/godavari-politics-bommaji-anil-kumar-tm-vijai-kumar-chandrababu-ap-elections-2024d7877478-5161-4e43-9cb6-0fbaa1987038-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/godavari-politics-bommaji-anil-kumar-tm-vijai-kumar-chandrababu-ap-elections-2024d7877478-5161-4e43-9cb6-0fbaa1987038-415x250-IndiaHerald.jpg- పార్టీ కోసం కోట్లు ఖ‌ర్చుచేసి సీటు రాక‌పోయినా జోష్‌లో బొమ్మాజీ అనిల్‌ - ఇటు చింత‌ల‌పూడితో పాటు అటు అన్న విజ‌య్ కోసం ప్ర‌చారం - అమెరికా నుంచి ఆంధ్రా వ‌ర‌కు పార్టీ గెలుపు కోసం క‌ష్ట‌ప‌డుతోన్న వైనం - భ‌విష్య‌త్తులో అయినా మంచి ఛాన్స్ ఇవ్వాలంటోన్న కేడ‌ర్‌ ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) పూటకో పార్టీ మారే నేతలు.. అవసరం కొద్దీ వారానికో పార్టీ కండువాలు మార్చే నాయకులు.. ఈతరం రాజకీయాల్లో ఎంతోమంది కనిపిస్తున్నారు. ప్రతి ఎన్నికకు అవసరాన్ని బట్టి పార్టీలు మారటం కామన్ అయిపోయింది. పార్టీ కోసం సంవత్సరాల తరబడGODAVARI POLITICS;BOMMAJI ANIL KUMAR;TM VIJAI KUMAR;CHANDRABABU.AP ELECTIONS 2024{#}anil music;American Samoa;Joseph Vijay;chinthalapudi venkatramaiah;Lokesh;Mini;Lokesh Kanagaraj;Service;Nijam;CBN;Scheduled caste;District;Telugu Desam Party;India;Partyఇలాంటి లీడ‌రే కదా ఏ పార్టీకైనా కావాల్సింది... గోల చేసే టీడీపీ లీడ‌ర్లు ' అనిల్ ' డిసిప్లైన్ నేర్చుకోండి..!ఇలాంటి లీడ‌రే కదా ఏ పార్టీకైనా కావాల్సింది... గోల చేసే టీడీపీ లీడ‌ర్లు ' అనిల్ ' డిసిప్లైన్ నేర్చుకోండి..!GODAVARI POLITICS;BOMMAJI ANIL KUMAR;TM VIJAI KUMAR;CHANDRABABU.AP ELECTIONS 2024{#}anil music;American Samoa;Joseph Vijay;chinthalapudi venkatramaiah;Lokesh;Mini;Lokesh Kanagaraj;Service;Nijam;CBN;Scheduled caste;District;Telugu Desam Party;India;PartyMon, 15 Apr 2024 11:16:54 GMT- పార్టీ కోసం కోట్లు ఖ‌ర్చుచేసి సీటు రాక‌పోయినా జోష్‌లో బొమ్మాజీ అనిల్‌
- ఇటు చింత‌ల‌పూడితో పాటు అటు అన్న విజ‌య్ కోసం ప్ర‌చారం
- అమెరికా నుంచి ఆంధ్రా వ‌ర‌కు పార్టీ గెలుపు కోసం క‌ష్ట‌ప‌డుతోన్న వైనం
- భ‌విష్య‌త్తులో  అయినా మంచి ఛాన్స్ ఇవ్వాలంటోన్న కేడ‌ర్‌

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
పూటకో పార్టీ మారే నేతలు.. అవసరం కొద్దీ వారానికో పార్టీ కండువాలు మార్చే నాయకులు.. ఈతరం రాజకీయాల్లో ఎంతోమంది కనిపిస్తున్నారు. ప్రతి ఎన్నికకు అవసరాన్ని బట్టి పార్టీలు మారటం కామన్ అయిపోయింది. పార్టీ కోసం సంవత్సరాల తరబడి కష్టబ‌డి కోట్ల రూపాయలకు ఖర్చు చేసుకొని.. సీటు రాకపోయినా పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థి గెలుపు కోసం కష్టపడుతూ.. తనకు సీటు రాకపోయినా తాను నమ్మిన పార్టీని గెలిపించాలని కష్టపడే నాయకుల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఏ పార్టీకైనా అలాంటి నేతలే కావాలి.


ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి నేతలు భూతద్దంలో పెట్టి వెతికిన కనపడటం లేదు. అలాంటి మంచి నాయకులలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొమ్మాజీ అనిల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. దివంగత మాజీ ఐఏఎస్ బొమ్మాజి దానం రెండో కుమారుడు అయిన అనిల్ ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటు అమెరికాలో పెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్నారు. అక్కడ పలు కంపెనీలు స్థాపించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు.. తాను పుట్టిన గడ్డకు సేవ చేయాలన్న సంకల్పంతో ఇండియాలో విద్య, సేవారంగంలో కొనసాగుతున్నారు.


అనిల్ అన్న బిఎన్‌. విజయ్ కుమార్ సంతనూతలపాడు నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత టీడీపీలోకి వచ్చిన విజయ్ అదే నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అన్న విజయ్ కుమార్ బాటలోనే రాజకీయాల్లోకి వచ్చి తాను కూడా ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో అనిల్ ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. చింతలపూడి నియోజకవర్గాన్ని ఆనుకుని తెలంగాణలో అశ్వరావుపేటలో అనిల్‌ కుటుంబానికి కళాశాలలు కూడా ఉన్నాయి. చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు యేడాది క్రితమే ఎంట్రీ ఇచ్చిన అనిల్.. లక్షలాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేసి ఈ రిజర్వుడ్ నియోజకవర్గంలో నిస్తేజంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మంచి ఊపిరి ఇచ్చారు అనటంలో ఎలాంటి సందేహం లేదు.


లోకేష్ యువ‌గళం పాదయాత్ర తో పాటు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన.. మినీ మహానాడు, ఇతర సభలు సమావేశాలు జరిగినప్పుడు అనిల్ మంచినీళ్ళ‌ కొద్దీ డబ్బు ఖర్చు పెట్టి.. పార్టీకి మంచి ఊపు తెచ్చారు. ఆకుమర్తి రామారావు, బొమ్మాజీ అనిల్,  సొంగా రోష‌న్‌ కుమార్.. చింతలపూడి సీటు కోసం పోటీ పడగా పార్టీ అధిష్టానం రోష‌న్ కుమార్‌కు సీటు ఇచ్చింది. ఆ వెంటనే అనిల్ ఏ మాత్రం బాధ‌ప‌డ‌కుండా రోష‌న్‌ కుమార్‌ను కలిసి ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఎన్నికల ముందు నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారని కూడా ఓపెన్ గా చెప్పారు. అక్కడితో ఆగకుండా తన అన్న విజయ్ పోటీ చేస్తున్న సంతనూతలపాడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అక్కడ కూడా ఆదుకుంటూ.. తన ఉదార మనస్తత్వాన్ని చాటుకుంటున్నారు. భ‌విష్య‌త్తులో అయినా అనిల్‌కు పార్టీ ప‌రంగా మంచి స్థానం ఇవ్వాల‌ని కోరే నేత‌లు చాలా మంది ఉన్నారు.


యేడాది పాటు తనను గుండెల్లో పెట్టుకుని ప్రేమించిన చింతలపూడి నియోజకవర్గంలో కూడా.. తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కు ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అనిల్ ఆదుకుంటూ వస్తున్నారు. ఈ విషయంలో అనిల్‌కు నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే. అటు తన అన్న పోటీ చేస్తున్న సంతనూతలపాడు నియోజకవర్గంలో మాత్రమే కాదు.. ఇటు తాను టికెట్ ఆశించి విఫలమైన చింతలపూడి నియోజకవర్గంతో పాటు అమెరికాలో కూడా ఎంతోమంది తెలుగువారిని మోటివేట్ చేస్తూ ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఆవశ్యకతను వివరిస్తూ.. నిస్వార్ధమైన నిక్కచ్చి మనస్తత్వం ఉన్న యువనేతగా బొమ్మాజి అనిల్ చెర‌గని ముద్ర వేసుకున్నారు. నిజం చెప్పాలంటే చింతలపూడిలో ఆయనకు సీటు రాలేదు.. ఈ నియోజకవర్గాన్ని ఆయన మర్చిపోతాడు అనుకున్నా చాలామంది కార్యకర్తలకు ఎప్పుడు ఏ సాయం ఉన్నా.. ఆయన టచ్ లోకి రావటం.. ఇక్కడ వారందరినీ ప్రేమతో ఆప్యాయతతో చూసుకుంటూ ఉండటం.. అనిల్ పట్ల పార్టీ క్యాడర్లో ఉన్న పాజిటివిటీకి సంకేతం అని చెప్పాలి. నిజంగా ఇలాంటి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఉంటే తెలుగుదేశం పార్టీకి తిరుగే ఉండదని.. అస‌లు గ్రూపుల గోలలే ఉండ‌వ‌ని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>