PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr39384cdc-68b6-4d64-b713-640b4dc1d769-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr39384cdc-68b6-4d64-b713-640b4dc1d769-415x250-IndiaHerald.jpgఏపీ ఎన్నికల్లో ఎవరు విజేత అంటే యూ ట్యూబ్ లో బొచ్చెడు సర్వేలు ఉన్నాయి. మరి ఓటర్ల మదిలో ఏముందో ఈ రోజుకీ ఎవరికీ తెలియదు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఏపీలో చూస్తే సీఎం జగన్ కు జనాలు వస్తున్నారు. చంద్రబాబుకు వస్తున్నారు. అక్కడా ఈలలు, గోలలు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఎవరి జనాలు వారికే ఉన్నారు. ఎవరి ఓట్లు వారి దగ్గరే ఉన్నాయి. మరి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండే న్యూట్రల్ జనాలు ఎవరి వైపు ఉన్నారు అంటే వారు పెదవి విప్పరు. వారు ఏకంగా ఈవీఎంలోనే తమ మనసులో ఓటును బయట పెడతారు. దీంతో సర్వేలు అనేవిత తీసి పktr{#}KTR;Nara Lokesh;Ishtam;Yevaru;CM;YCP;CBN;Jagan;Andhra Pradesh;Congressఏపీలో ఎవరు గెలుస్తారో చెప్పేసిన కేటీఆర్?ఏపీలో ఎవరు గెలుస్తారో చెప్పేసిన కేటీఆర్?ktr{#}KTR;Nara Lokesh;Ishtam;Yevaru;CM;YCP;CBN;Jagan;Andhra Pradesh;CongressMon, 15 Apr 2024 09:39:00 GMTఏపీ ఎన్నికల్లో ఎవరు విజేత అంటే యూ ట్యూబ్ లో బొచ్చెడు సర్వేలు ఉన్నాయి.  మరి ఓటర్ల మదిలో ఏముందో ఈ రోజుకీ ఎవరికీ  తెలియదు.  ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఏపీలో చూస్తే సీఎం జగన్ కు జనాలు వస్తున్నారు. చంద్రబాబుకు వస్తున్నారు. అక్కడా ఈలలు, గోలలు చేస్తున్నారు.


దీనిని బట్టి చూస్తే ఎవరి జనాలు వారికే ఉన్నారు. ఎవరి ఓట్లు వారి దగ్గరే ఉన్నాయి. మరి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండే న్యూట్రల్ జనాలు ఎవరి వైపు ఉన్నారు అంటే వారు పెదవి విప్పరు. వారు ఏకంగా ఈవీఎంలోనే తమ మనసులో ఓటును బయట పెడతారు. దీంతో సర్వేలు అనేవిత తీసి పక్కన పెట్టాలా లేక పట్టించుకోవాలా అంటే ఎవరి ఇష్టం వారిది.


ఇక పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఏపీ ఎన్నికల మీద ఆసక్తి ఉంది. తెలంగాణలో అయితే ఎవరు గెలుస్తారు అంటే ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడతారు. అధికార కాంగ్రెస్ కి ఏపీలో ఎవరు గెలవాలని అంటే బయటకు చెప్పరు కానీ.. అక్కడ వైసీపీ ఓడితే తమకు రాజకీయ లాభం అని అంటారు. అలాగే విపక్ష బీఆర్ఎస్ కి ఏపీలో ఎవరుండాలి అంటే జగన్ అన్నది అన్యాపదేశంగా అంతా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అసలు ఎవరు గెలుస్తారు అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానం ఇచ్చారు.


ఈ సమాధానం మాత్రమే కాదు. ఆసక్తి కూడా. ఇంతకీ ఆయన ఏం సమాధానం చెప్పారు అంటే ఏపీలో అందరూ నాకు కావాల్సిన వారే. జగన్ అన్నయ్య అవుతారు. పవన్ కూడా అన్నయ్యతో సమానం. లోకేశ్ నాకు స్నేహితుడు. చంద్రబాబు అయితే పెద్దవారు. అంటూ అందర్నీ వరుసలు కలిపేశారు. అందువల్ల ఎవరూ గెలిచినా ప్రజలకు మంచి చేయాలని అని డిప్లమాటిక్ గా చెప్పారు. అంతే కాదు ఏపీ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. మంచి తీర్పు ఇస్తారు అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అక్కడ నాకు ఓటు లేదని.. ఓటరుని కాదు అని చెప్పారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>