Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr7a61b2e6-1c5a-4c90-9665-0029e2fdfbde-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr7a61b2e6-1c5a-4c90-9665-0029e2fdfbde-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కలుపుతున్నాయి. ఈ క్రమంలోనే అటు బిఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయంపై భారీగానే ఆశలు పెట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ స్థానాలకి మాత్రమే పరిమితమైన బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఇలాంటి సమయంలో పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. దీంతో గులాబీ దళపతి కెసిఆర్ కి వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయKcr{#}Medak;Dalapathi;Bharatiya Janata Party;Parliment;Assembly;District;Telangana;KCR;Congress;Party;Yevaru;MLA;CM;Joseph Vijay;Newsమెదక్ : కేసీఆర్ కు బిగ్ షాక్.. అనుకున్నదే జరిగింది?మెదక్ : కేసీఆర్ కు బిగ్ షాక్.. అనుకున్నదే జరిగింది?Kcr{#}Medak;Dalapathi;Bharatiya Janata Party;Parliment;Assembly;District;Telangana;KCR;Congress;Party;Yevaru;MLA;CM;Joseph Vijay;NewsMon, 15 Apr 2024 19:30:00 GMTప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కలుపుతున్నాయి. ఈ క్రమంలోనే అటు బిఆర్ఎస్ పార్టీపార్లమెంట్ ఎన్నికల్లో విజయంపై భారీగానే ఆశలు పెట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ స్థానాలకి మాత్రమే పరిమితమైన బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఇలాంటి సమయంలో పార్టీలోని కీలక నేతలు అందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. దీంతో గులాబీ దళపతి కెసిఆర్ కి వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి.


 ఇలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలు అందరిలో కూడా ఆత్మవిశ్వాసం పెంచాలని కెసిఆర్ అనుకుంటున్నారు. అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లను పక్కన పెడితే అటు కెసిఆర్ సొంత జిల్లా అయిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని అనుకుంటున్నారు. అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో బిజెపి తరఫున రఘునందన్ రావు, బిఆర్ఎస్ తరఫున వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ తరపున నీలం మధు బరిలో దిగారు. అయితే ఎవరు గెలుస్తారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కాగా కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లాలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.  మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రస్తుత మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కలిసి ఇక నీలం మధు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.


 సీఎం రేవంత్ బిఆర్ఎస్ లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకొని కేసీఆర్ను దెబ్బ కొట్టినట్లుగానే.. మైనంపల్లి హనుమంతరావు కూడా మెదక్ లోని బిఆర్ఎస్ నేతలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు పావులు కదిపారు. వారితో సమావేశం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక బిఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్ కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు అనుకున్నదే జరిగింది. మెదక్ లో కేసీఆర్ కి బిగ్ షాక్ తగిలింది.  మున్సిపల్ చైర్మన్ తోడుపునూరు చంద్రపాల్, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>