Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanrh573a5142-0578-41c5-b685-0000d7111c58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanrh573a5142-0578-41c5-b685-0000d7111c58-415x250-IndiaHerald.jpgతెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అధికారాన్ని చేజెక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని అనుకుంటుంది. మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే గెలుపు గుర్రాలను బరిలోకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మిగతా అభ్యర్థులతో పోల్చి చూస్తే కాంగ్రెస్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడంలో కాస్త ముందు ఉన్నారు అని చెప్పాలి. కానీ ఏకంగా రేవంతRevanrh{#}revanth;sunita singer;Eatala Rajendar;Malkajgiri;Rahul Gandhi;Cheque;Avunu;Bharatiya Janata Party;sunil;Dookudu;local language;Parliment;Assembly;Congress;Party;Reddy;CMఅయ్యో రేవంత్.. సిట్టింగ్ స్థానంలోనే కాంగ్రెస్ వెనుకబడిందా?అయ్యో రేవంత్.. సిట్టింగ్ స్థానంలోనే కాంగ్రెస్ వెనుకబడిందా?Revanrh{#}revanth;sunita singer;Eatala Rajendar;Malkajgiri;Rahul Gandhi;Cheque;Avunu;Bharatiya Janata Party;sunil;Dookudu;local language;Parliment;Assembly;Congress;Party;Reddy;CMMon, 15 Apr 2024 20:00:00 GMTతెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అధికారాన్ని చేజెక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని అనుకుంటుంది. మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే గెలుపు గుర్రాలను బరిలోకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మిగతా అభ్యర్థులతో పోల్చి చూస్తే కాంగ్రెస్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడంలో కాస్త ముందు ఉన్నారు అని చెప్పాలి. కానీ ఏకంగా రేవంత్ సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరిలో మాత్రం కాంగ్రెస్ వెనుకబడిందా అంటే అవును అనే వాదనే ఎక్కువగా వినిపిస్తుంది.



 తన సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి లో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు సీఎం రేవంత్ పట్టుదలతో ఉన్నారు. ఇక ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఇదే లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ వెనుకబడి ఉందా.. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కొనుగోలు ఏఐసీసీ దూతలకు సమర్పించిన రిపోర్టులో ఏముంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే బలమైన ఆర్థిక రాజకీయ నేపథ్యమున్న పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డిని.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టింది. బిజెపి నుంచి మరో బలమైన నేత ఈటల రాజేందర్ కూడా బరిలో ఉన్నారు.


కాగా కదా మల్కాజ్గిరి విజయం పై బిజెపి కూడా గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రధాన మోడీ ఓ దఫా ప్రచారం నిర్వహించి వెళ్ళారు కూడా. ఇలాంటి పరిణామాలు నేపథ్యంలో  ఎన్నికల రేసులో కాంగ్రెస్కు వెనకబడి ఉన్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రచారంలో దూకుడు పెంచాలని స్థానిక నేతలను కలుపుకొని కీలక నేతలను  పార్టీలో చేర్చుకుంటూ ముందుకు సాగాలని ఇటీవల పార్టీ సమావేశంలో సునీల్ కొనుగోలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసి వేణుగోపాల్ నేతలకు సూచించారట. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసేందుకు అందరు దోహదం చేయాలని.. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారట. అయితే స్థానికులను కాదని స్థానికేతర నేత అయిన సునిత మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం పట్ల ఇక పార్టీలోని ఇతర నేతల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుందట. ప్రచార సమయంలో ఆమెకు సహాయ నిరాకరణ జరుగుతుంద. ఇలా కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టాలంటే రేవంత్ బరిలోకి దిగితేనే సెట్ అవుతుందని మిగతా కేడర్ అభిప్రాయపడుతున్నారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>