Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipla8ad3f83-22c9-479d-830f-4d3ab58c18cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipla8ad3f83-22c9-479d-830f-4d3ab58c18cd-415x250-IndiaHerald.jpgఅప్పుడెప్పుడో 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఐపీఎల్ టైటిల్ గెలిచింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ జట్టుకు టైటిల్ గెలవడం అనేది కలగానే మిగిలిపోయింది. ఏకంగా టీమ్ లో ఎంతోమంది ఆటగాళ్లను మార్చిన ఇక జట్టు కెప్టెన్లను సైతం మారుస్తూ వస్తున్న ఆ జట్టుకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా భారీ అంచనాల మధ్య టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. కొత్త కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ సారథ్యంలో బరిలోకి దిగింది. ఈ క్రమIpl{#}Jersey;Hyderabad;Cricketసన్రైజర్స్ విధ్వంసకర ఆటగాడికి.. ఫేవరెట్ ప్లేయర్ ఎవరో తెలుసా?సన్రైజర్స్ విధ్వంసకర ఆటగాడికి.. ఫేవరెట్ ప్లేయర్ ఎవరో తెలుసా?Ipl{#}Jersey;Hyderabad;CricketMon, 15 Apr 2024 19:00:00 GMTఅప్పుడెప్పుడో 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఐపీఎల్  టైటిల్ గెలిచింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ జట్టుకు టైటిల్ గెలవడం అనేది కలగానే మిగిలిపోయింది. ఏకంగా టీమ్ లో ఎంతోమంది ఆటగాళ్లను మార్చిన ఇక జట్టు కెప్టెన్లను సైతం మారుస్తూ వస్తున్న ఆ జట్టుకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా భారీ అంచనాల మధ్య టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. కొత్త కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ సారథ్యంలో   బరిలోకి దిగింది.


 ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సన్రైజర్స్ బౌలింగ్ విభాగం ఎంతో పటిష్టంగా  ఉన్నప్పటికీ బ్యాటింగ్లో మాత్రం ఎప్పుడూ తేలిపోతూ ఉంటుంది. మరి ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో సరైన ఆటగాళ్లు లేకపోవడమే సన్ రైజర్స్ కి మైనస్ గా మారిపోతుంది అంటూ ఎంతోమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం సన్రైజర్స్ బ్యాటింగ్ చూస్తే ప్రత్యర్థులకు వవణుకు పుడుతుంది. ఆ రేంజ్ లో ఆటగాళ్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. మరియు ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో సైతం అలవోకగా సిక్సర్లు  కొడుతూ వీర విహారం చేస్తున్నరు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసెన్.


 ఈ క్రమంలోనే అతని బ్యాటింగ్ విధ్వంసం ముందు స్కోర్ బోర్డు సైతం పరుగులు పెట్టి అలసిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే స్పిన్ బౌలింగ్లో సైతం ఎంతో అలవోకగా సిక్సర్లు కొట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి అన్న విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు క్లాసేన్. స్వదేశంలో నాకు అద్భుతమైన స్పిన్నర్లు బౌలింగ్ చేశారు. వారిని ఎదుర్కొనే క్రమంలో ఎంతగానో మెరుగయ్యాను. ఇక క్రికెట్ దిగ్గజం గేల్ నా ఫేవరెట్ బ్యాటర్. అందుకే ఆయన జెర్సీ నెంబర్ 45 నే నేను కూడా ధరిస్తూ ఉంటాను అంటూ క్లాసేన్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>