PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagn2022e313-3cbb-40d9-87b7-56f2dca1d20f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jagn2022e313-3cbb-40d9-87b7-56f2dca1d20f-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఘటన వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఆ పార్టీ అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. అదృష్టం బాగుండి సీఎం జగన్ ప్రమాదం నుంచి బయటపడ్డారని ఇంతటి దుర్ఘటనను డ్రామాగా కొట్టిపారేయడం దారుణమని వైసీపీ అభిమానులు చెబుతున్నారు. ఎవరైనా తన సునిశిత భాగంలో దాడి చేయించుకుంటారా? అంటూ రివర్స్ లో వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. జగన్ పై ప్లాన్ ప్రకారమే దాడులు జరుగుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. jagan{#}Yatra;Evening;YCP;CM;Jagan;Partyరాయి ఎటాక్ : జగన్ పై దాడి ఘటనతో లెక్కలు మారాయా.. న్యూట్రల్ ఓటర్ల నిర్ణయమిదే!రాయి ఎటాక్ : జగన్ పై దాడి ఘటనతో లెక్కలు మారాయా.. న్యూట్రల్ ఓటర్ల నిర్ణయమిదే!jagan{#}Yatra;Evening;YCP;CM;Jagan;PartyMon, 15 Apr 2024 08:30:00 GMTఏపీ సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఘటన వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఆ పార్టీ అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. అదృష్టం బాగుండి సీఎం జగన్ ప్రమాదం నుంచి బయటపడ్డారని ఇంతటి దుర్ఘటనను డ్రామాగా కొట్టిపారేయడం దారుణమని వైసీపీ అభిమానులు చెబుతున్నారు. ఎవరైనా తన సునిశిత భాగంలో దాడి చేయించుకుంటారా? అంటూ రివర్స్ లో వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. జగన్ పై ప్లాన్ ప్రకారమే దాడులు జరుగుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
నాడు చంద్రబాబుపై దాడి జరిగిన సమయంలో గగ్గోలు పెట్టిన నేతలు నేడు జగన్ పై దాడి జరిగిన సమయంలో అవహేళన చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే జగన్ పై జరిగిన దాడి వల్ల న్యూట్రల్ ఓటర్ల మనస్సు మారిందని 7 నుంచి 8 నియోజకవర్గాలలో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు మారే ఛాన్స్ అయితే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
గతంతో పోలిస్తే పరిస్థితులు మారాయని సింపతీతో ఓట్లు పడే పరిస్థితులు అయితే లేవని అదే సమయంలో సింపతీ కొంతమేర మాత్రం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. కనీసం 100 స్థానాలలో గెలవాలని వైసీపీ కోరుకుంటోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే 2029 ఎన్నికల సమయానికి పరిస్థితులు మారిపోతాయని వైసీపీ నేతలు ఫీలవుతున్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తే తమ పార్టీకి తిరుగుండదని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
 
ఏపీలో ఎన్నికలకు సరిగ్గా నాలుగు వారాల సమయం ఉండటంతో పొలిటికల్ హీట్ పెరగడంతో పాటు రాష్ట్రంలో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి జగన్ బస్సు యాత్ర యథాతథంగా కొనసాగనుంది. ఈరోజు సాయంత్రం గుడివాడ వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గుడివాడకు జగన్ చేరుకునే విధంగా షెడ్యూల్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>