Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pabtha627ef55-770a-4664-b938-621edbc8105a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pabtha627ef55-770a-4664-b938-621edbc8105a-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్లో ఆటగాళ్లు అతిగా ప్రవర్తించడానికి ఎక్కువగా అవకాశం ఉండదు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తమ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ ఇక ఆటను కొనసాగించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం కొన్ని కొన్ని సార్లు ఇక తమ కంట్రోల్ కోల్పోతూ ఉంటారు. ఇక రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఎవరైనా ప్రొఫెషనల్ క్రికెట్లో ఆటగాళ్లు ఇలా రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తించారు అంటే వారి పట్ల ఐసీసీ కఠినమైన చర్యలు తీసుకోవడం చేస్తూ ఉంటుంది. భారీగPabth{#}Rishabh Pant;Delhiఎందుకు ఊరుకున్నారు.. పంత్ పై చర్యలు తీసుకోండి : మాజీ ప్లేయర్ఎందుకు ఊరుకున్నారు.. పంత్ పై చర్యలు తీసుకోండి : మాజీ ప్లేయర్Pabth{#}Rishabh Pant;DelhiSun, 14 Apr 2024 09:30:00 GMTసాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్లో ఆటగాళ్లు అతిగా ప్రవర్తించడానికి ఎక్కువగా అవకాశం ఉండదు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తమ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ ఇక ఆటను కొనసాగించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం కొన్ని కొన్ని సార్లు ఇక తమ కంట్రోల్ కోల్పోతూ ఉంటారు. ఇక రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఎవరైనా ప్రొఫెషనల్ క్రికెట్లో ఆటగాళ్లు ఇలా రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తించారు అంటే వారి పట్ల ఐసీసీ కఠినమైన చర్యలు తీసుకోవడం చేస్తూ ఉంటుంది.


 భారీగా జరిమానులు విధించడం లేదంటే కొన్ని మ్యాచ్లపాటు ఇక నిషేధం విధించడం లాంటివి చేస్తూ వస్తుంది. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా ఇలాంటి రూల్స్ పాటిస్తూ ఉంటారు. అంపైర్ లతో ఎవరైనా గొడవకు దిగిన లేకపోతే ఎంపైర్ నిర్ణయం పై ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేసినా కూడా భారీగా జరిమానా పడటం చూస్తూ ఉంటాం. అయితే ఇటీవలే లక్నో, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ముందుగా వైడ్ విషయంలో రివ్యూ కోరిన రిషబ్ పంత్.. ఇక తర్వాత అతని రివ్యూ ఫెయిల్ అవ్వడంతో తాను రివ్యూ కోరలేదు అంటూ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు.


 అయితే రిషబ్ పంత్ తీరు చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక ఇదే విషయంపై మాజీ క్రికెటర్ గిల్ క్రిస్ట్ స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. లక్నోతో మ్యాచ్లో అంపైర్లతో పంత్ వాగ్వాదానికి దిగడం సరైనది కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇశాంత్ బౌలింగ్లో బంతిని ఫీల్డ్ ఎంపైర్ వైడ్ గా ప్రకటించారు. అయితే అంతలోనే పంత్ రివ్యూ కోరినట్లు సైగలు చేశాడు. రివ్యూలో వైడ్ అని తేలగా తాను సమీక్ష కోరలేదు అంటూ రిషబ్ పంత్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. అయితే దీనికోసం నాలుగు నిమిషాల పాటు చర్చ అవసరంలేదని.. ఇలాంటి ప్లేయర్లకు జరిమానా విధించాల్సిందే అంటూ గిల్ క్రిస్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>