Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-elections4275b62a-7b29-4d1a-8c66-05e09a8affef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-elections4275b62a-7b29-4d1a-8c66-05e09a8affef-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలవటంతో అధికార పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి తన పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నారు.. “మేమంతా సిద్ధం” పేరుతో 21 రోజుల పాటు బస్సు యాత్రను ప్రారంభించారు.అయితే నిన్న విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసాడు..ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రాయి జగన్ కనుబొమ్మపై భాగంలో తాకింది. దీంతో ఎడమకంటి కనుబొ#assembly elections{#}Akkineni Nageswara Rao;bus;YCP;CM;Minister;Sharmila;Reddy;Party;police;Andhra Pradesh;TDP;Jaganఏపీ : జగన్ పై దాడి.. సంచలన పోస్ట్ చేసిన షర్మిల..!!ఏపీ : జగన్ పై దాడి.. సంచలన పోస్ట్ చేసిన షర్మిల..!!#assembly elections{#}Akkineni Nageswara Rao;bus;YCP;CM;Minister;Sharmila;Reddy;Party;police;Andhra Pradesh;TDP;JaganSun, 14 Apr 2024 08:07:37 GMTరాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలవటంతో అధికార పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి తన పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నారు..ప్రచారంలో భాగంగా “మేమంతా సిద్ధం” పేరుతో 21 రోజుల పాటు బస్సు యాత్రను ప్రారంభించారు.అయితే నిన్న విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసాడు..ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రాయి జగన్ కనుబొమ్మపై భాగంలో తాకింది. దీంతో ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.అయితే తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం అని అన్నారు. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం అని ఆమె పేర్కొన్నారు. 

ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కావాలని చేసి ఉంటే కనుక ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఇలాంటి ఘటనను ఖండించాల్సిందే అని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, హింసను  ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండించాల్సిందే అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు..సోదరుడు జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు.ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాయి దాడిని వైసీపీ నేతలు మరియు తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావు లేదన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కోలేక భయంతో జగన్ పై రాయి దాడి చేయించారని టీడీపీ నేతలపై మంత్రి అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరియు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టి  దీనికి కారణమైన వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>