Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika58c1ad33-51fc-464d-b7cb-5ba66bf130f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika58c1ad33-51fc-464d-b7cb-5ba66bf130f2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. చలో అనే సినిమాతో నాగశౌర్యతో జోడి కట్టి టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే హిట్టు కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడికి క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం అనే సినిమాలో నటించింది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దర్శక నిర్మాతలు అందరూ చూపు కూడా రష్మిక వైపు మళ్ళింది. అయితే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రష్మికకు నేషనల్ క్Rashmika{#}Crush;rashmika mandanna;Allu Arjun;bollywood;vijay deverakonda;Heroine;Cinemaనాకంటే అందగత్తెలు చాలామంది ఉన్నారు : రష్మికనాకంటే అందగత్తెలు చాలామంది ఉన్నారు : రష్మికRashmika{#}Crush;rashmika mandanna;Allu Arjun;bollywood;vijay deverakonda;Heroine;CinemaSun, 14 Apr 2024 12:15:00 GMTప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. చలో అనే సినిమాతో నాగశౌర్యతో జోడి కట్టి టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే హిట్టు కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడికి క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం అనే సినిమాలో నటించింది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దర్శక నిర్మాతలు అందరూ చూపు కూడా రష్మిక వైపు మళ్ళింది. అయితే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రష్మికకు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ఇచ్చేసింది గూగుల్.


 ఇక ఎంతోమంది కుర్రాళ్ల మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన అతి తక్కువ సమయంలోనే అవకాశాలను దక్కించుకుంది. ఇక పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ మరో లెవెల్ కి వెళ్ళిపోయింది. పుష్ప పాత్రలో నటించిన అల్లు అర్జున్ కి ఎలా అయితే అభిమానులు పెరిగిపోయారో.. ఇక శ్రీవల్లి పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రష్మికకు కూడా అదే రీతిలో పాపులారిటీ వచ్చింది. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ  బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.



 ఈ లోకంలో తనకంటే అందం టాలెంట్ ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు అంటూ రష్మిక మందన్న కామెంట్ చేసింది. కానీ తనకు అదృష్టం కొద్ది మంచి అవకాశాలు రావడంతో ఈ స్థాయికి చేరుకోగలిగాను అంటూ చెప్పుకొచ్చింది. జీవితంలో సంతోషాన్ని, పొందిన విజయాలని ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగే విజయాలను అంత సులభంగా తీసుకోకూడదు అంటూ రష్మిక తెలిపారు. అయితే రష్మిక మందన్న చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. కాగా ఈ లోకంలో నీకంటే అందమైన అమ్మాయిలు ఉండొచ్చు. కానీ నువ్వే మా ఫేవరెట్ అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>