MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal7b0679a2-99bb-4e18-bdfa-c3fbbe44a2e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal7b0679a2-99bb-4e18-bdfa-c3fbbe44a2e8-415x250-IndiaHerald.jpgలోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం భారతీయుడు అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. తమిళ్ లో రూపొందిన ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయ్యి ఆ సమయంలో అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇంతటి స్థాయి విజయం సాధించిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. రెహమాన్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాలో కమల్ హాసన్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించి రెండింటి లోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్kamal{#}rakul preet singh;Bharateeyudu;kajal aggarwal;Kollywood;Posters;Music;Audience;June;Success;Tollywood;Darsakudu;Director;shankar;Tamil;Telugu;Cinema;Hero"భారతీయుడు 2" నుండి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!"భారతీయుడు 2" నుండి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!kamal{#}rakul preet singh;Bharateeyudu;kajal aggarwal;Kollywood;Posters;Music;Audience;June;Success;Tollywood;Darsakudu;Director;shankar;Tamil;Telugu;Cinema;HeroSun, 14 Apr 2024 12:23:16 GMTలోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం భారతీయుడు అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. తమిళ్ లో రూపొందిన ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయ్యి ఆ సమయంలో అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇంతటి స్థాయి విజయం సాధించిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

రెహమాన్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాలో కమల్ హాసన్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించి రెండింటి లోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను , విమర్శకులను మెప్పించాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చాలా సంవత్సరాల తర్వాత దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ హీరో గా "భారతీయుడు 2" అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

కొన్ని రోజుల క్రితం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కాకపోతే దానిని "ఇండియన్ 2" అనే పోస్టర్ తో విడుదల చేశారు.  తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ మూవీ విడుదల గురించి అప్డేట్ ఇచ్చింది.  "భారతీయుడు 2" సినిమాని ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు. ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇప్పటికే భారతీయుడు మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాకు కొనసాగింపుగా రాబోతున్న మూవీ కావడంతో "భారతీయుడు 2"  పై తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా టాలీవుడ్ ఆడియన్స్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>