PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganfdd7151a-594e-47d3-b7f5-b18de58fdd64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganfdd7151a-594e-47d3-b7f5-b18de58fdd64-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొనిరావడం కోసం విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు. ఈ నెల 25వ తేదీన జగన్ పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ నెల 24వ తేదీన శ్రీకాకుళంలో బస్సు యాత్రను ముగించుకుని జగన్ నేరుగా పులివెందులకు వెళ్లి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేయనున్నారు. cm jagan{#}electricity;RTC;Godavari River;East;Pulivendula;Krishna River;bus;Jagan;News;Hanu Raghavapudi;Reddy;YCP;Assembly;CMఏపీ : జగన్ కు సవాలుగా మారుతున్న జిల్లాలివే.. ఇక్కడ గెలుపు సులువు కాదా?ఏపీ : జగన్ కు సవాలుగా మారుతున్న జిల్లాలివే.. ఇక్కడ గెలుపు సులువు కాదా?cm jagan{#}electricity;RTC;Godavari River;East;Pulivendula;Krishna River;bus;Jagan;News;Hanu Raghavapudi;Reddy;YCP;Assembly;CMSat, 13 Apr 2024 10:13:00 GMTఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొనిరావడం కోసం విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు. ఈ నెల 25వ తేదీన జగన్ పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ నెల 24వ తేదీన శ్రీకాకుళంలో బస్సు యాత్రను ముగించుకుని జగన్ నేరుగా పులివెందులకు వెళ్లి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేయనున్నారు.
 
2019 ఎన్నికల్లో 90 వేల 110 ఓట్ల మెజారిటీతో గెలిచిన జగన్ ఈ ఎన్నికల్లో అంతకు మించిన మెజార్టీతో పులివెందుల నుంచి విజయం సాధించాలని భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మెజారిటీతో పోల్చి చూస్తే 2019 ఎన్నికల్లో జగన్ కు ఎక్కువ మెజార్టీ వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో కొన్ని జిల్లాలు జగన్ కు సవాలుగా మారాయి. ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలలో జగన్ కు గెలుపు సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రోడ్ల విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైసీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందినా అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని గోదావరి వాసులు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడంలో జగన్ ఫెయిల్ అయ్యారని స్థానికులు చెబుతున్నారు. ప్రజల స్పందన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని ఆర్టీసీ డ్రైవర్లు చెబుతున్నారు.
 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా రాయితీలు, వసతులు వర్తించవని చెబుతున్నారని మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయని పెరిగిన ధరల వల్ల ఇబ్బందులు పడుతున్నామని వైసీపీ అనుకూల ఓటర్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని ఓటర్లు భావిస్తున్నారు. ప్రజల్లో వస్తున్న మార్పును దృష్టిలో ఉంచుకుని జగన్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. ఎన్నికల్లో ఓటమి పాలైతే ఐదేళ్ల పాటు వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి ఉంటుంది.
 
 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>