Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr99613d01-3dad-4ffd-96d4-ae2d8cf4d63c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr99613d01-3dad-4ffd-96d4-ae2d8cf4d63c-415x250-IndiaHerald.jpgతెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు కోసం తెగ పోరాటం చేస్తున్నాయ్. ఈ క్రమంలోనే ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బిఆర్ఎస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికే 17 స్థానాలలో పోటీ చేయబోయే అభ్యర్థులు వివరాలను ప్రకటించింది. ఆయా అభ్యర్థులు ప్రచార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మరోవైపు బిజెపి పార్టీలు కూడా గెలుపు కోసం తీKcr{#}Yevaru;vishwa;Nijam;Survey;Elections;Telangana;Bharatiya Janata Party;Congress;Parliment;Assembly;Partyసర్వే రిపోర్టులో సంచలనం.. బిఆర్ఎస్ ను ప్రజలు మర్చిపోయారట?సర్వే రిపోర్టులో సంచలనం.. బిఆర్ఎస్ ను ప్రజలు మర్చిపోయారట?Kcr{#}Yevaru;vishwa;Nijam;Survey;Elections;Telangana;Bharatiya Janata Party;Congress;Parliment;Assembly;PartySat, 13 Apr 2024 17:00:00 GMTతెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు కోసం తెగ పోరాటం చేస్తున్నాయ్. ఈ క్రమంలోనే ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బిఆర్ఎస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికే 17 స్థానాలలో పోటీ చేయబోయే అభ్యర్థులు వివరాలను ప్రకటించింది. ఆయా అభ్యర్థులు ప్రచార రంగంలో కూడా దూసుకుపోతున్నారు.


 ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మరోవైపు బిజెపి పార్టీలు కూడా గెలుపు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని సర్వేల రిపోర్టులు మాత్రం హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే ఇలా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కొన్ని సర్వే రిపోర్టుల్లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయాన్ని చెబుతూ ఉంటాయి. ఇలాంటి సర్వేలు కొన్ని కొన్ని సార్లు నిజం అవుతూ ఉంటాయి. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి ఒక సర్వే రిపోర్ట్ సంచలనంగా మారిపోయింది. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తున్న బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదట. కాంగ్రెస్, బిజెపి మధ్య అసలైన పోరు ఉంటుందని ఈ సర్వే రిపోర్ట్ చెబుతోంది.


 ఒకవైపు కీలక నేతలు పార్టీని వదిలి వెళ్ళడం.. ఇంకోవైపు కెసిఆర్ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం.. ఇంకోవైపు బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం మాత్రమే కాకుండా.. ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్రంలో మరో నాలుగేళ్లు అధికారంలో ఉంటుందని.. ఇంకోవైపు కేంద్రంలో మరోసారి బిజెపి సర్కార్ వస్తుందని భావిస్తున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్బిజెపిలకు ఓటు వేసేందుకు రెడీ అయ్యారట. బిఆర్ఎస్ పార్టీని పట్టించుకోవడమే మానేశారట. గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా జనాలు బిఆర్ఎస్ ను మర్చిపోయారట. ఒక హైదరాబాదులో ఓవైసీ మినహా మిగతా 16 స్థానాలలో కాంగ్రెస్, బిజెపి పార్టీలే విజయం సాధిస్తాయని సర్వే రిపోర్ట్ చెబుతోంది. ఇక కాంగ్రెస్ బిజెపి పార్టీలకు చెరో ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయని సర్వే రిపోర్ట్ చెబుతోంది. మరి ఓటింగ్ సమయంలో తెలంగాణ ఓటర్లు ఏం నిర్ణయిస్తారో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>