Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fraudb37c5e90-3948-48fd-9d75-c52287601b79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fraudb37c5e90-3948-48fd-9d75-c52287601b79-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్లకి గుర్తు తెలియని నెంబర్ ల నుంచి ఫోన్లు రావడం సర్వసాధారణంగా మారిపోయింది. ఎంతోమంది క్రెడిట్ కార్డ్ లేదా ఇతర కస్టమర్ కేర్ కి సంబంధించిన ప్రతినిధులు తరచు కొత్త నెంబర్లతో ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక వీళ్ల దగ్గరికి నా నెంబర్ ఎలా వెళ్ళింది అబ్బా అని ఇలా కొత్త నెంబర్లు వచ్చినప్పుడల్లా అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ రావడం కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక మహిళకు గుర్తు తెలియని నెంబర్ నుంచి వచFraud{#}Customer;Hello;Smart phone;Girl;Husband;policeకొత్త నెంబర్ నుంచి మహిళకు కాల్.. ఫోన్ ఎత్తగానే షాక్?కొత్త నెంబర్ నుంచి మహిళకు కాల్.. ఫోన్ ఎత్తగానే షాక్?Fraud{#}Customer;Hello;Smart phone;Girl;Husband;policeSat, 13 Apr 2024 10:30:00 GMTఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్లకి గుర్తు తెలియని నెంబర్ ల నుంచి ఫోన్లు రావడం సర్వసాధారణంగా మారిపోయింది. ఎంతోమంది క్రెడిట్ కార్డ్ లేదా ఇతర కస్టమర్ కేర్ కి సంబంధించిన ప్రతినిధులు తరచు కొత్త నెంబర్లతో ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక వీళ్ల దగ్గరికి నా నెంబర్ ఎలా వెళ్ళింది అబ్బా అని ఇలా కొత్త నెంబర్లు వచ్చినప్పుడల్లా అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ రావడం కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది అని చెప్పాలి.



 అయితే ఇక్కడ ఒక మహిళకు గుర్తు తెలియని నెంబర్ నుంచి వచ్చిన ఒక కాల్ చివరికి ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి అదే పనిగా ఫోన్ వచ్చింది. కస్టమర్ కేర్ నెంబర్ అయ్యుంటుంది అనుకున్న మహిళ.. ఆ ఫోన్ ఎత్తలేదు. కానీ అదే పనిగా ఫోన్ రావడంతో ఏంటా అని కాల్ ఎత్తింది. తర్వాత ఆమెకు ఊహించని షాప్ తగిలింది. అవతలి వైపు నుంచి మాట్లాడుతున్న వ్యక్తి.. హలో నీ రేటెంత.. అమ్మాయి కావాలి అంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో సదరు మహిళ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయింది. నా మొబైల్ కి ఇలాంటి కాల్స్ రావడం ఏంటి అనుకుంది.


 ఆ తర్వాత కాల్ కట్ చేసింది. కానీ ఇక మరికొన్ని కొత్త నెంబర్స్ నుంచి ఇలాంటి కాల్స్ రావడంతో  వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగుళూరులోని యశ్వంతపురాలో వెలుగు చూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త వేధింపుల  వల్ల ఆమె విడాకులకు అప్లై వేసిన కారణంగానే.. ఇక ఆమె భర్తే ఇలా చేశాడు అన్న విషయం బయటపడింది. ఫేస్బుక్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇక అందులో ఆమె ఫోటో పెట్టి కాల్ గర్ల్స్ కావాలా అంటూ ఆమె మొబైల్ నెంబర్ కూడా పెట్టాడట. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>