Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rcba688b98c-114d-4042-84e7-606cf2482bae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rcba688b98c-114d-4042-84e7-606cf2482bae-415x250-IndiaHerald.jpgప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఇక అభిమానుల అంచనాలు అందుకోలేక ఎప్పుడు నిరాశ పరుస్తూ ఉంటుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఈసారి కూడా పరిస్థితి ఇలాగే ఉంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటుంది అనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస ఓటములతో సతమతం అవుతుంది. అయితే ఈ ఏడాది జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఉమెన్స్ ఆర్సిబి జట్టు ఎలా అయితే టైటిల్ విజేతగా నిలిచిందో ఇక ఐపీఎల్ 17వ సీజన్లో మెన్స్ టీం కూడా టైటిల్ గెలవడం ఖాయమని అభిమానులు బలంRcb{#}Royal Challengers;Mumbaiమాకు అలాంటి బౌలర్ ఉండుంటే బాగుండేది : RCB కెప్టెన్మాకు అలాంటి బౌలర్ ఉండుంటే బాగుండేది : RCB కెప్టెన్Rcb{#}Royal Challengers;MumbaiSat, 13 Apr 2024 06:50:00 GMTప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఇక అభిమానుల అంచనాలు అందుకోలేక ఎప్పుడు నిరాశ పరుస్తూ ఉంటుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఈసారి కూడా పరిస్థితి ఇలాగే ఉంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటుంది అనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస ఓటములతో సతమతం అవుతుంది. అయితే ఈ ఏడాది జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఉమెన్స్ ఆర్సిబి జట్టు ఎలా అయితే టైటిల్ విజేతగా నిలిచిందో ఇక ఐపీఎల్ 17వ సీజన్లో మెన్స్ టీం కూడా టైటిల్ గెలవడం ఖాయమని అభిమానులు బలంగా నమ్మారు.


 కానీ ఊహించని రీతిలో బెంగుళూరు టీం అంచనాలను అందుకోలేక పోతుంది. ఏకంగా వరుస ఓటములతో సతమతమవుతుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన బెంగళూరు కేవలం ఒకే ఒక విజయాన్ని మాత్రమే సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాయింట్స్ పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టైటిల్ గెలవడం గురించి దేవుడెరుగు. కనీసం ఆర్సిబి ప్లే ఆఫ్ కి అయినా క్వాలిఫై అవుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే బ్యాటింగ్ విభాగం పరవాలేదు అనిపిస్తున్న.. బెంగళూరు బౌలింగ్ విభాగం మాత్రం జట్టుకు మైనస్ గా మారిపోతుంది.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న డుప్లేసెస్ మరో టీం బౌలర్ పై ప్రశంసలు కురిపించాడు. ముంబై ఇండియన్స్  స్టార్ బౌలర్ బుమ్రా లాంటి  బౌలర్ తమ జట్టులో కూడా ఉండుంటే బాగుండేది అంటూ డూప్లెసెస్ అభిప్రాయపడ్డాడు. బుమ్రాలో అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. మలింగా నేతృత్వంలో అతను మరింత మెరుగయ్యాడు. అలాంటి క్లాస్ బౌలర్ మాకు కూడా కావాలి. మ్యాచ్ లో బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. మా బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదు. మేము 250 పైగా పరుగులు చేసి ఉంటే బాగుండేది అంటూ ముంబై ఇండియన్స్ తో జరిగిన ఓటమిపై స్పందించాడు ఆర్సిబి కెప్టెన్ .



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>