MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akshay2400c783-a35c-434e-8b4d-ed6942c5a05f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akshay2400c783-a35c-434e-8b4d-ed6942c5a05f-415x250-IndiaHerald.jpgఅక్షయ్ కుమార్ హీరో గా , టైగర్ ష్రాఫ్ , పృథ్వీరాజ్ సుకుమారన్‌ , సోనాక్షి సిన్హా , మానుషి చిల్లర్ , అలాయా ఎఫ్ కీలక పాత్రల్లో బడే మియా చోటే మియా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి జూలియస్ పాకియం నేపథ్య సంగీతం అందించారు. జాకీ భగ్నానీ , వషు భగ్నానీ , దీప్సికా దేశ్‌ముఖ్ , అలీ అబ్బాస్ జాఫర్ , హిమాన్షు కిషన్ మెహ్రా ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 11 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. స్టైలిష్ యాక్షన్ ఎంటరakshay{#}Kumaar;Sonakshi Sinha;Tiger Shroff;ali;Box office;Posters;jaaki;Music;cinema theater;bollywood;Cinemaఅఫీషియల్ : "బడే మియా చోటే మియా" కి మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఇవే..!అఫీషియల్ : "బడే మియా చోటే మియా" కి మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఇవే..!akshay{#}Kumaar;Sonakshi Sinha;Tiger Shroff;ali;Box office;Posters;jaaki;Music;cinema theater;bollywood;CinemaSat, 13 Apr 2024 01:15:00 GMTఅక్షయ్ కుమార్ హీరో గా , టైగర్ ష్రాఫ్ , పృథ్వీరాజ్ సుకుమారన్‌ , సోనాక్షి సిన్హా , మానుషి చిల్లర్ , అలాయా ఎఫ్ కీలక పాత్రల్లో బడే మియా చోటే మియా అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి జూలియస్ పాకియం నేపథ్య సంగీతం అందించారు. జాకీ భగ్నానీ , వషు భగ్నానీ , దీప్సికా దేశ్‌ముఖ్ , అలీ అబ్బాస్ జాఫర్ , హిమాన్షు కిషన్ మెహ్రా ఈ మూవీ ని నిర్మించారు. 

ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 11 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా విడుదల అయిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి పరవాలేదు అనే స్థాయిలో మాత్రమే మొదటి రోజు కలెక్షన్ లు దక్కాయి.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ లకి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 36.33 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్ లు వచ్చినట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త నెగిటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణం ఈ మూవీ కథ , కథనాలు అన్నీ రొటీన్ గా ఉండటమే అని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో వచ్చిన ఎన్నో యక్షన్ సినిమాల మాదిరిగానే ఈ మూవీ కూడా ఉన్నట్లు ఆ కారణం తోనే ఈ మూవీ కి కాస్త నెగటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ లాంగ్ రన్ లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>