Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/electionsd475bab8-39ba-414b-a381-86bfaf83755a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/electionsd475bab8-39ba-414b-a381-86bfaf83755a-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా రంగంలోకి వెళ్లి అక్కడ బాగా సెటిల్ అయినప్పుడు.. ఇక అదే రంగంలోకి తమ వారసులను కూడా తీసుకురావాలని అనుకుంటూ ఉంటారు. అయితే చిత్ర పరిశ్రమలో ఇలాంటిది ఎక్కువగా చూస్తూ ఉంటామ్. ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ లో కూడా ఇలాంటి వారసత్వ రాజకీయాలు ఎక్కువైపోయాయి. దశాబ్దాల నుంచి పాలిటిక్స్ లో కొనసాగుతున్న నేతలు వారి వారసులను కూడా రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇక వారసులను నిలబెట్టేందుకు ఎలాంటి పనైనా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక దశాబ్ద కాలం నుంచి నమ్ముకున్న పార్టీని సైతం ఇక వారసుల రాజకీయ భవిషElections{#}Allu Aravind;Odisha;Maha;Telangana Chief Minister;CM;politics;Partyకన్న ప్రేమ కోసం.. తల్లి లాంటి పార్టీకి ఎదురెళ్తున్నాడు?కన్న ప్రేమ కోసం.. తల్లి లాంటి పార్టీకి ఎదురెళ్తున్నాడు?Elections{#}Allu Aravind;Odisha;Maha;Telangana Chief Minister;CM;politics;PartySat, 13 Apr 2024 09:00:00 GMTసాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా రంగంలోకి వెళ్లి అక్కడ బాగా సెటిల్ అయినప్పుడు.. ఇక అదే రంగంలోకి తమ వారసులను కూడా తీసుకురావాలని అనుకుంటూ ఉంటారు. అయితే చిత్ర పరిశ్రమలో ఇలాంటిది ఎక్కువగా చూస్తూ ఉంటామ్. ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ లో కూడా ఇలాంటి వారసత్వ రాజకీయాలు ఎక్కువైపోయాయి. దశాబ్దాల నుంచి పాలిటిక్స్ లో కొనసాగుతున్న నేతలు వారి వారసులను కూడా రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇక వారసులను నిలబెట్టేందుకు ఎలాంటి పనైనా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక దశాబ్ద కాలం నుంచి నమ్ముకున్న పార్టీని సైతం ఇక వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం వదులుకునేందుకు రెడీ అవుతున్న పరిస్థితులు కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం.



ఇలా రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. ఇక ఎన్నో చిత్ర విచిత్రాలు అప్పుడప్పుడు రాజకీయాలలో తారసపడుతూ ఉంటాయి. అప్పటి వరకు ఒక పార్టీపై విమర్శలు చేసి విరుచుకుపడిన నేతలు ఆ తర్వాత కాలంలో అదే పార్టీలోకి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయడం లాంటివి కొన్ని కొన్ని సార్లు ఓటర్లను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అయితే ఇక ఇప్పుడు ఒడిశా రాజకీయాల్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో పాటు బీజేడి పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఛాన్స్ వస్తే చాలు విమర్శలతో విరుచుకుపడే వ్యక్తుల్లో బీజయ్ మహాపాత్ర ఒకరు.



 ఈయన ఇప్పటివరకు సీఎం నవీన్ పట్నాయక్ తో పాటు బీజేడి పార్టీని విమర్శలతో ఎంతలా ఏకీపారేసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది అన్న విధంగా సీఎం నవీన్ పట్నాయక్ బిజయ్ మహాపాత్ర మధ్య పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. ఆయన బిజెపిలో కీలక పదవులను నిర్వర్తించారు. కానీ ఇప్పుడు ఏకంగా కుమారుడి రాజకీయ భవిష్యత్తును నిలబెట్టేందుకు ఇన్నాళ్లు తిట్టిపోసిన పార్టీ తరఫున ఇప్పుడు ప్రచారానికి సిద్ధమయ్యారు. బిజయ్ మహా పాత్ర కుమారుడు అరవింద్ మహాపాత్ర బిజెడి నుండి పట్ కూర ప్రాంతంలో పోటీ చేస్తున్నారు. దీంతో కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం తప్పని పరిస్థితుల్లో ఇక బిజెడికి మద్దతు ఇస్తున్నారు. జీవితమంతా వ్యతిరేకించిన పార్టీ తరఫున ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>