Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle431d524f-806a-4ebe-af91-3a03aa77a995-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle431d524f-806a-4ebe-af91-3a03aa77a995-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందిన సత్యం రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సత్యం సినిమాతో మంచి కమెడియన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటుడు సత్యం రాజేశ్‌ ఆ తర్వాత కామెడియన్‌ గా తనకంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.ఇక ఈ కామెడియన్ హీరో గా మారిన సంగతి తెలిసిందే. గతేడాది 'మా ఊరి పొలిమేర' 2 అంటూ వచ్చి సత్యం రాజేష్ సూపర్ హిట్ అందుకున్నాడు. 'మా ఊరి పొలిమేర' సినిమా కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌ మేజిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సి#socialstars lifestyle{#}bharath;sathyam;satyam rajesh;Tollywood;Sri Bharath;Music;Comedian;Hero;Thota Chandrasekhar;Chitram;Cinemaఆకట్టుకుంటున్న సత్యం రాజేష్ "టెనంట్ " ట్రైలర్..!!ఆకట్టుకుంటున్న సత్యం రాజేష్ "టెనంట్ " ట్రైలర్..!!#socialstars lifestyle{#}bharath;sathyam;satyam rajesh;Tollywood;Sri Bharath;Music;Comedian;Hero;Thota Chandrasekhar;Chitram;CinemaSat, 13 Apr 2024 20:32:54 GMTటాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందిన సత్యం రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సత్యం సినిమా తో మంచి కమెడియన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటుడు సత్యం రాజేశ్‌ ఆ తర్వాత కామెడియన్‌ గా తనకంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.ఇక ఈ కామెడియన్ హీరో గా మారిన సంగతి తెలిసిందే. గతేడాది 'మా ఊరి పొలిమేర' 2 అంటూ వచ్చి సత్యం రాజేష్ సూపర్ హిట్ అందుకున్నాడు. 'మా ఊరి పొలిమేర' సినిమా కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌ మేజిక్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా అనంతరం సత్యం రాజేష్ వరుస సినిమాలను లైన్‌ లో పెడుతున్నాడు. తాజాగా సత్యం రాజేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “టెనంట్” ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్‌ గా వస్తున్న ఈ చిత్రానికి వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌ తో పాటు ట్రైలర్ ను విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి మేకర్స్ రిలీజ్‌ ట్రైలర్ విడుదల చేశారు.ప్రస్తుత సమాజంలో మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసేలా ఈ ట్రైలర్ సాగింది. ‘టెనంట్ ‘ మూవీ శ్రీరామనవమి కానుక గా ఏప్రిల్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మేఘా చౌదరి, చందన పయావుల మరియు భరత్ కాంత్ వంటి తదితరులు ఈ సినిమా లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు.ఇదిలా ఉంటే “పొలిమేర 2” సినిమా తో హిట్ అందుకున్న సత్యం రాజేష్ త్వరలోనే “పొలిమేర 3” తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>