EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawana258e2d1-acfc-4775-8030-e54ee971b687-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawana258e2d1-acfc-4775-8030-e54ee971b687-415x250-IndiaHerald.jpgపిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ అన్నది ఆసక్తి రేకేత్తిస్తోంది. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. చివరి నిమిషం వరకు సస్పెన్స్ లో ఉంచేశారు. అయితే కొద్ది రోజుల క్రితమే పవన్ దాన్ని రివిల్ చేశారు. పిఠాపురంలో పవన్ పోటీ చేయడానికి కారణాలు లేకపోలేదు. 2019లో పిఠాపురంలో జనసేన అభ్యర్థికి 28వేల ఓట్లు పోలయ్యాయి. ఆ పార్టీ మూడో స్థానంలో ఉంది. అయినా పవన్ ధైర్యంగా పిఠాపురం ఎంచుకోవడానికి కారణం అక్కడ టీడీపీ బలంగా ఉంది. ఈ రెండు కలిస్తే విజయం అతి సునాయసం అవుతుందని విశ్లేషించుకొని ఈ స్థానాన్ని ఎంచుకున్నpawan{#}Ram Gopal Varma;pithapuram;Pawan Kalyan;CBN;Janasena;TDP;Party;MLAపిఠాపురం: ఇలాగైతే పవన్‌కు మళ్లీ ఓటమి తప్పదా?పిఠాపురం: ఇలాగైతే పవన్‌కు మళ్లీ ఓటమి తప్పదా?pawan{#}Ram Gopal Varma;pithapuram;Pawan Kalyan;CBN;Janasena;TDP;Party;MLASat, 13 Apr 2024 09:00:28 GMTపిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ అన్నది ఆసక్తి రేకేత్తిస్తోంది. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. చివరి నిమిషం వరకు సస్పెన్స్ లో ఉంచేశారు. అయితే కొద్ది రోజుల క్రితమే పవన్ దాన్ని రివిల్ చేశారు.  పిఠాపురంలో పవన్ పోటీ చేయడానికి కారణాలు లేకపోలేదు.
2019లో పిఠాపురంలో జనసేన అభ్యర్థికి 28వేల ఓట్లు పోలయ్యాయి. ఆ పార్టీ మూడో స్థానంలో ఉంది. అయినా పవన్ ధైర్యంగా పిఠాపురం ఎంచుకోవడానికి కారణం అక్కడ టీడీపీ బలంగా ఉంది. ఈ రెండు కలిస్తే విజయం అతి సునాయసం అవుతుందని విశ్లేషించుకొని ఈ స్థానాన్ని ఎంచుకున్నారు.


పిఠాపురంలో టీడీపీ సంస్థాగతంగా బలమైన పార్టీ. ఈ పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తే పవన్ గెలుపు నల్లేరుపై నడకే. మొత్తం పిఠాపురంలో రెండు వందలకు పైగా పోలింగ్ బూత్ లు ఉన్నాయి. అన్ని బూత్ ల్లో జనసేన పోల్ మేనేజ్ మెంట్ చేయగలదా అంటే దానికి టీడీపీ ఉందనే జవాబు వస్తోంది. మొత్తంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే టీడీపీ గట్టిగా పూనుకుంటే పవన్ విజయం. లేకపోతే ఆయన ఖాతాలో మరో ఓటమి ఖాయం. అందుకే వర్మను పవన్ వ్యూహాత్మకంగా తన వెంట తిప్పుకుంటున్నారు. ఇక్కడ ఏం చేయాలి. ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి వంటి అంశాలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన వర్మకు బాగా తెలుసు.


అందుకు జనసేనాని పూర్తిగా వర్మ మీదనే పూర్తి బాధ్యతను పెట్టారు. మరోవైపు చంద్రబాబు కూడా టికెట్ రాకుంటే పిలిచి మాట్లాడి పవన్ విజయానికి కృషి చేయాలని సూచించారు. దీంతో ఆయన పవన్ రాకపోయినా నేనే దగ్గరుండి గెలిపిస్తా అనే హామీ ఇచ్చారు.  ఇక పవన్ తరఫున ప్రచారానికి వెళ్లిన వర్మకు టీడీపీ క్యాడర్ షాక్ ఇచ్చింది.  మీరు పవన్ కోసం ఎలా ప్రచారం నిర్వహిస్తారు అంటూ ఆయనతో వాగ్వాదానికి దిగారు. దీంతో జనసైనికుల్లో ఆందోళన నెలకొంది. మరి టీడీపీ క్యాడర్ ఓట్లు వేస్తారా. పవన్ ఎమ్మెల్యే అవుతారా అనేది చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>