Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr076e03a6-cc21-42af-b976-b0758a01ba3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr076e03a6-cc21-42af-b976-b0758a01ba3b-415x250-IndiaHerald.jpgఅసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గక ముందే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే ఇక పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా కేసిఆర్ పై రివెంజ్ తీర్చుకోవడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు సాగుతున్నారు. బిఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు అందరిని కూడా హస్తం గూటికి చేర్చుకుంటున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఇలాంటి పార్టీ ఫిరాయింపులు కామన్. ఒక పార్టీలో ఉన్న నేతలు మరో పార్టీలోకి వెళ్లడం ఎప్పుడూ చూస్తూనే ఉంKtr{#}KTR;srihari;Warangal;KCR;Parliment;Car;Yevaru;Parliament;revanth;Party;Telangana;Congressఇలా జరుగుతుందనుకోలేదు.. నమ్మించి గొంతు కోశాడు : కేటీఆర్ఇలా జరుగుతుందనుకోలేదు.. నమ్మించి గొంతు కోశాడు : కేటీఆర్Ktr{#}KTR;srihari;Warangal;KCR;Parliment;Car;Yevaru;Parliament;revanth;Party;Telangana;CongressSat, 13 Apr 2024 11:30:00 GMTఅసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గక ముందే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే ఇక పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో  రాష్ట్ర రాజకీయాలలో అనూహ్యమైన   పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా కేసిఆర్ పై రివెంజ్ తీర్చుకోవడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు సాగుతున్నారు. బిఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు అందరిని కూడా హస్తం గూటికి చేర్చుకుంటున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఇలాంటి పార్టీ ఫిరాయింపులు కామన్.



 ఒక పార్టీలో ఉన్న నేతలు మరో పార్టీలోకి వెళ్లడం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. కానీ పార్టీ అధినేతకు నమ్మకస్తులుగా ఉన్న నేతలు ఇప్పుడు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఇది సంచలనంగా మారింది. ఏకంగా కెసిఆర్ కు ఆప్తుడిగా, నమ్మిన బంటుగా ఉన్న కడియం శ్రీహరి బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎన్నో కీలకమైన పదవుల్లో కొనసాగారు. అలాంటి నేత తన కూతురు కడియం కావ్య తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది కేసిఆర్ కు ఒక భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇలా కారు పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి చేరిన కడియం శ్రీహరి పై గులాబీ పార్టీ  నేతలు అందరూ తీవ్రస్థాయిలో విమర్శల గుప్పిస్తూ ఉన్నారు.


 అయితే ఇటీవలే కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇదే విషయంపై మాట్లాడారు. కేసీఆర్ను కడియం శ్రీహరి చేసినంత మోసం ఎవరు చేయలేదు అంటూ కేటీఆర్ అన్నారు. ఇన్నేళ్లలో కేసీఆర్ ను చాలా మంది మోసం చేశారు. కానీ కడియం శ్రీహరి చేసింది నయవంచన. తన కూతురికి వరంగల్ టికెట్ తీసుకుని మధ్యాహ్నం కేసీఆర్ తో భోజనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కానీ ఆరోజు సాయంత్రానికి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఇది నిజంగా నమ్మించి గొంతు కోయడమే అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>