MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan9a6558ec-d3b4-454f-a26c-e8cbe2ca6f81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan9a6558ec-d3b4-454f-a26c-e8cbe2ca6f81-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కుటుంబ సమేతంగా నేడు తమిళనాడులోని చెన్నైకి వెళ్లడం జరిగింది. అక్కడ మీడియా వారు చరణ్‌, ఉపాసన ఇంకా క్లింకార ఫోటోలు తీసేందుకు తెగ పోటీ పడ్డారు. గతంలో రామ్ చరణ్ ఎన్నో సార్లు చెన్నై వెళ్లారు. అలాగే తన భార్య ఉపాసన కూడా చెన్నై కి వెళ్తూనే ఉంటారు.అయితే ఈసారి వెళ్లడం మాత్రం మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకం. ఎందుకంటే తమిళనాడకు చెందిన ప్రముఖ VELS యూనివర్సిటీ వారు రామ్‌ చరణ్‌ కు గౌరవ డాక్టరేట్‌ ను అందించబోతుంది. ఇక నేడు జరుగబోతున్న VELS యూనివర్సిటీ స్నాతకోత్సవం లో రామ్‌ చరణ్‌ పాల్గొRam Charan{#}Upasana;Ram Charan Teja;Chiranjeevi;Chennai;shankar;ram pothineni;king;Wife;University;producer;Producer;News;Cinema;Pawan Kalyan;mediaమెగా పవర్ స్టార్ కి అరుదైన గౌరవం?మెగా పవర్ స్టార్ కి అరుదైన గౌరవం?Ram Charan{#}Upasana;Ram Charan Teja;Chiranjeevi;Chennai;shankar;ram pothineni;king;Wife;University;producer;Producer;News;Cinema;Pawan Kalyan;mediaSat, 13 Apr 2024 18:41:30 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కుటుంబ సమేతంగా నేడు తమిళనాడులోని చెన్నైకి వెళ్లడం జరిగింది. అక్కడ మీడియా వారు చరణ్‌, ఉపాసన ఇంకా క్లింకార ఫోటోలు తీసేందుకు తెగ పోటీ పడ్డారు. గతంలో రామ్ చరణ్ ఎన్నో సార్లు చెన్నై వెళ్లారు. అలాగే తన భార్య ఉపాసన కూడా చెన్నై కి వెళ్తూనే ఉంటారు.అయితే ఈసారి వెళ్లడం మాత్రం మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకం. ఎందుకంటే తమిళనాడకు చెందిన ప్రముఖ VELS యూనివర్సిటీ వారు రామ్‌ చరణ్‌ కు గౌరవ డాక్టరేట్‌ ను అందించబోతుంది. ఇక నేడు జరుగబోతున్న VELS యూనివర్సిటీ స్నాతకోత్సవం లో రామ్‌ చరణ్‌ పాల్గొంటాడు. ఆ సమయంలోనే యూనివర్శిటీ పెద్దల చేతుల మీదుగా రామ్ చరణ్‌ గౌరవ డాక్టరేట్‌ ను అందుకోబోతున్నాడు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి గతంలో ఆంధ్రా యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ ను అందుకున్నారు. ఇప్పుడు VELS యూనివర్సిటీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకోబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.


మెగా ఫ్యామిలీలోనే కాకుండా టాలీవుడ్‌ నుంచి ఈ అరుదైన ఘనత దక్కించుకున్న హీరోగా రామ్ చరణ్‌ నిలువబోతున్నాడు. VELS యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ను అందుకునేందుకు చెన్నై ఎయిర్‌ పోర్ట్‌ లో ల్యాండ్‌ అయిన చరణ్‌, ఉపాసన, క్లింకార ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. రామ్ చరణ్ ఎప్పటిలాగే సింపుల్‌ అండ్ స్వీట్‌ లుక్‌ లో సింప్లీ సూపర్ అన్నట్లుగా ఉన్నాడు. ఇందులో క్లింకార ఫేస్ ను మాత్రం ఈసారి కూడా రివీల్‌ చేయలేదు.ఇక రామ్ చరణ్‌ సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ చేంజర్ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాదిలోనే ఈ మూవీని విడుదల చేసే విధంగా నిర్మాత దిల్‌ రాజు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. గేమ్‌ చేంజర్ సినిమా కాకుండా చరణ్‌ ఇటీవలే బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ను కూడా మొదలు పెట్టాడు. అతి త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం అవ్వబోతుంది. ఇక ఈ రెండు సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>