DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu31699c52-c0e5-48a6-b809-5e94f833c3f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu31699c52-c0e5-48a6-b809-5e94f833c3f5-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో కొంత కాలం నుంచి వాలంటీర్ల వ్యవహారం రచ్చకెక్కింది. గ్రామాల్లో ప్రజలకు ఎంతో సహాయంగా ఉన్న వాలంటీర్లపై గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పలు సందర్భాల్లో అనేక కామెంట్లు చేశారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించే వాలంటీర్లపై వీరిద్దరూ చేసిన ఆరోపణలు వివాదాస్పద మయ్యాయి. దీనివల్ల ప్రజల నుంచి వ్యతిరేకత రావడం మొదలైంది. దీంతో పాటు ఇటీవల నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ పథకాల పంపిణీలో వీరిని దూరంగా పెట్టాలని ఈసీకి ఫిర్యాదు చేయించారు. దీంతో ఈసీ వీరిపై మూడు నెలల పాటు నిషేదం వchandrababu{#}Election Commission;Pawan Kalyan;Kumaar;CBN;Andhra Pradesh;TDP;News;YCP;Jaganఏపీ: చంద్రబాబును వెంటాడుతున్న వాలంటీర్లు?ఏపీ: చంద్రబాబును వెంటాడుతున్న వాలంటీర్లు?chandrababu{#}Election Commission;Pawan Kalyan;Kumaar;CBN;Andhra Pradesh;TDP;News;YCP;JaganSat, 13 Apr 2024 11:00:00 GMTఏపీ రాజకీయాల్లో కొంత కాలం నుంచి వాలంటీర్ల వ్యవహారం రచ్చకెక్కింది. గ్రామాల్లో ప్రజలకు ఎంతో సహాయంగా ఉన్న వాలంటీర్లపై గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పలు సందర్భాల్లో అనేక కామెంట్లు చేశారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించే వాలంటీర్లపై వీరిద్దరూ చేసిన ఆరోపణలు వివాదాస్పద మయ్యాయి. దీనివల్ల ప్రజల నుంచి వ్యతిరేకత రావడం మొదలైంది.


దీంతో పాటు ఇటీవల నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ పథకాల పంపిణీలో వీరిని దూరంగా పెట్టాలని ఈసీకి ఫిర్యాదు చేయించారు. దీంతో ఈసీ వీరిపై మూడు నెలల పాటు నిషేదం విధించింది. దీంతో పింఛన్ల పంపిణీ ఆలస్యం అవడం, పలువురు వృద్ధులు మరణించడం తో ఈ ప్రభావమంతా చంద్రబాబుపై పడింది. వెంటనే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిన ఆయన వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు వారి జీతం కూడా డబుల్ చేస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించేశారు.


గతంలో వాలంటీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసి ఇప్పుడు వాళ్లకి జీతాలు పెంచుతాం ఓటేయ్యండి అంటే ఎలా నమ్ముతారు అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఈ వ్యవస్థనే కాకుండా సంక్షేమ పథకాలను సైతం విమర్శించారు. ప్రస్తుతం ఈ పథకాల విషయంలో యూ టర్న్ తీసుకొని తాను అధికారంలోకి వస్తే జగన్ ను మించి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.


కొన్నేళ్ల క్రితం చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ ద్వారా వ్యక్తి సమాచారం చోరీ చేస్తున్నారని.. ఈ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని ఆరోపణలు గుప్పించారు. దీంతో పాటు ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాలంటీర్లు ఇళ్లకు వెళ్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసే ఏ వాలంటీర్ ను వదిలిపెట్టను అంటూ వార్నింగ్ లు ఇచ్చారు. ఇప్పుడు వీటన్నింటిని వైసీపీ నాయకులు తమ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మొత్తం మీద వాలంటీర్ల టాపిక్ లేకుండా ఏపీ రాజకీయాలు ముందుకు సాగడం లేదు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>