Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestylefb34d161-186b-4935-b25a-cb9c2edebcb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestylefb34d161-186b-4935-b25a-cb9c2edebcb6-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో ‘జెర్సీ’సినిమా స్పెషల్ సినిమా గా నిలిచింది..క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍లో నడిచే ఈ స్పోర్ట్స్ లవ్ డ్రామా మూవీ 2019లో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.ఈ మూవీ చూసిన ప్రతి ప్రేక్షకుడికి ‘జెర్సీ’ మూవీ ఫేవరెట్ ఫిల్మ్ గా మారిపోయింది.. ఈ మూవీలో నాని నటనకు మరోసారి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అంత ఆదరణ పొందిన.. 'జెర్సీ' సినిమా మళ్లీ థియేటర్లలోరీ రిలీజ్ కానుంది.జెర్సీ సినిమా ఏప్రిల్ 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుం#socialstars lifestyle{#}Shradda Kapoor;Love Story;Jersey;sithara;gautham new;gautham;Posters;Fidaa;Love;Chitram;Hanu Raghavapudi;Cinema;Nani;Andhra Pradeshరీ రిలీజ్ కి సిద్దమైన నాని "జెర్సీ"మూవీ..!!రీ రిలీజ్ కి సిద్దమైన నాని "జెర్సీ"మూవీ..!!#socialstars lifestyle{#}Shradda Kapoor;Love Story;Jersey;sithara;gautham new;gautham;Posters;Fidaa;Love;Chitram;Hanu Raghavapudi;Cinema;Nani;Andhra PradeshSat, 13 Apr 2024 16:19:08 GMTన్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో ‘జెర్సీ’ సినిమా స్పెషల్ సినిమా గా నిలిచింది..క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍లో నడిచే ఈ స్పోర్ట్స్ లవ్ డ్రామా మూవీ 2019లో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.ఈ మూవీ చూసిన ప్రతి ప్రేక్షకుడికి ‘జెర్సీ’ మూవీ ఫేవరెట్ ఫిల్మ్ గా మారిపోయింది.. ఈ మూవీలో నాని నటనకు మరోసారి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అంత ఆదరణ పొందిన.. 'జెర్సీ' సినిమా మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.జెర్సీ సినిమా ఏప్రిల్ 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆరోజున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పలు థియేటర్లలో జెర్సీ మూవీ స్పెషల్ షోలు పడనున్నాయి. ఏప్రిల్ 19 వ తేదీకి జెర్సీ చిత్రం రిలీజై ఐదేళ్లు పూర్తికానుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 20వ తేదీన ఈ చిత్రాన్ని మేకర్స్ మళ్లీ థియేటర్లలోకి తీసుకురానున్నారు.ఏప్రిల్ 20 న జెర్సీ మూవీ రీ-రిలీజ్‍ అవుతుందంటూ తాజాగా అధికారిక ప్రకన కూడా వచ్చింది. మేకర్స్ దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

జెర్సీ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. క్రికెట్, లవ్ స్టోరీ మరియు తండ్రీకొడుకుల ఎమోషన్ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఈ చిత్రంలో నాని యాక్టింగ్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ మూవీలోని ఎమోషన్ సీన్లలో ప్రేక్షకులను కంట తడి పెట్టించాయి.. అలాగే ఈ చిత్రంలో రైల్వే స్టేషన్ సీన్ ఐకానిక్‍గా నిలిచిపోయింది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‍గా నటించగా.. నాని కొడుకు పాత్రను రోణిత్ కర్మ చేశారు. ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించిన పాటలు, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి.జెర్సీ మూవీకి గాను 2021 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బెస్ట్ ఎడిటర్ పురస్కారం నవీన్ నూలికి దక్కింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు. 2019 ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ అయిన ఈ సుమారు రూ.50 కోట్ల వరకు వసూళ్లు అందుకుంది.మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఏప్రిల్ 20న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>