PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-andhrapradesh-elections-assembly-elections-2024-ap-elections-pre-poll-survey-mla-tickets-bjp-ap-bjp021828ad-21b4-4f5b-a967-f5e380870bc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-andhrapradesh-elections-assembly-elections-2024-ap-elections-pre-poll-survey-mla-tickets-bjp-ap-bjp021828ad-21b4-4f5b-a967-f5e380870bc5-415x250-IndiaHerald.jpg- స‌త్య‌ప్ర‌కాష్‌, సీఎం ర‌మేష్‌, కొత్త‌ప‌ల్లి గీత కులాంత‌ర వివాహాలు - చంద్ర‌బాబు, జ‌గ‌న్ రూట్లోనే ఏపీ బీజేపీ గేమ్‌ ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) 2019 ఎన్నికలలోనే వైసీపీ అధినేత జగన్ చాలా నియోజకవర్గాలలో ఇంట‌ర్‌క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లను వెతికి మరి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన పరిస్థితి. ఇక తాజా ఎన్నికలలో చంద్రబాబు కూడా అదే రూట్‌లో వెళుతున్నారు. గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో పిడుగురాళ్ల మాధవి, పెనుగొండలో సబితమ్మకు బీసీ కోటాలో చంద్రబాబు సీట్లు ఇచ్చారు. వాస్తవానికి ఈ ఇద్దరు మహిళల భరAP Assembly Elections; Andhrapradesh Elections; Assembly Elections 2024; AP Elections Pre Poll Survey; MLA tickets; bjp; AP BJP{#}Satya Prakash;Velama;Dharmavaram;Araku Valley;Rajya Sabha;Kothapalli;geetha;Anakapalle;Vishakapatnam;Piduguralla;Amaravathi;MP;Ananthapuram;Kamma;MLA;Scheduled caste;Wife;Reddy;India;Guntur;Backward Classes;Husband;Jagan;Andhra Pradesh;CBN;kadapa;CM;Party;Hanu Raghavapudi;YCPఏపీ బీజేపీలో కూడా ఇంట‌ర్ క్యాస్ట్ నేత‌ల‌కే ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు..?ఏపీ బీజేపీలో కూడా ఇంట‌ర్ క్యాస్ట్ నేత‌ల‌కే ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు..?AP Assembly Elections; Andhrapradesh Elections; Assembly Elections 2024; AP Elections Pre Poll Survey; MLA tickets; bjp; AP BJP{#}Satya Prakash;Velama;Dharmavaram;Araku Valley;Rajya Sabha;Kothapalli;geetha;Anakapalle;Vishakapatnam;Piduguralla;Amaravathi;MP;Ananthapuram;Kamma;MLA;Scheduled caste;Wife;Reddy;India;Guntur;Backward Classes;Husband;Jagan;Andhra Pradesh;CBN;kadapa;CM;Party;Hanu Raghavapudi;YCPFri, 12 Apr 2024 13:35:14 GMT- స‌త్య‌ప్ర‌కాష్‌, సీఎం ర‌మేష్‌, కొత్త‌ప‌ల్లి గీత కులాంత‌ర వివాహాలు
- చంద్ర‌బాబు, జ‌గ‌న్ రూట్లోనే ఏపీ బీజేపీ గేమ్‌


( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
2019 ఎన్నికలలోనే వైసీపీ అధినేత జగన్ చాలా నియోజకవర్గాలలో ఇంట‌ర్‌క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లను వెతికి మరి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన పరిస్థితి. ఇక తాజా ఎన్నికలలో చంద్రబాబు కూడా అదే రూట్‌లో వెళుతున్నారు. గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో పిడుగురాళ్ల మాధవి, పెనుగొండలో సబితమ్మకు బీసీ కోటాలో చంద్రబాబు సీట్లు ఇచ్చారు. వాస్తవానికి ఈ ఇద్దరు మహిళల భర్తలు కమ్మ వర్గానికి చెందినవారు కావడం విశేషం. ఆ మాటకు వస్తే జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన జొన్నలగడ్డ పద్మావతి.. బీసీ వర్గానికి చెందిన పిల్లి దీపిక, ఉషాశ్రీ చరణ్‌కు సీట్లు ఇచ్చారు. ఈ ముగ్గురు మహిళ నేతల భర్తలు కూడా రెడ్డి వర్గానికి చెందినవారు కావడం విశేషం.


ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి కూడా చంద్రబాబు, జగన్ రూట్‌లోనే ఇంటర్‌క్యాస్ట్ నేతలకు టిక్కెట్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అనకాపల్లి నుంచి బీజేపి తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన సీఎం రమేష్ భార్య కమ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావటం విశేషం. ఇక అరకు నుంచి బీజేపి ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టి అయినా.. ఆమె భర్త కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. కొత్తపల్లి గీత గత ఎన్నికలలోనే విశాఖపట్నం నుంచి బీజేపి  తరఫున పోటీ చేసిన పురందరేశ్వరిపై సొంత పార్టీ పెట్టి పోటీ చేసి ఓడిపోయారు.


అంతకుముందు 2014 ఎన్నికలలో ఆమె అరకు నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నుంచి బీజేపి తరఫున సత్య ప్రకాష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన స్వస్థలం కడప జిల్లాలోని ప్రొద్దుటూరు. బీసీలలోని బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన సత్య ప్రకాష్ కు పొత్తులో భాగంగా ధర్మవరం సీటు దక్కింది. అయితే సత్య ప్రకాష్ భార్య కూడా కమ్మ‌ సామాజిక వర్గానికి చెందిన వారు కావటం విశేషం. ఇలా ఏపీలో 2019 ఎన్నికల నుంచి ఇంటర్‌క్యాస్ట్ వివాహాలు చేసుకున్న వారికి సీట్లు ఇస్తూ ప్రధాన పార్టీలు ఎంకరేజ్ చేయడం కామన్ అయింది. ఇప్పుడు బీజేపి కూడా ఈ లిస్ట్‌లో చేరటం విశేషం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>