PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kadiyam-kavya176eb845-5927-46bd-bd63-a53215de0ec7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kadiyam-kavya176eb845-5927-46bd-bd63-a53215de0ec7-415x250-IndiaHerald.jpgవరంగల్ పార్లమెంట్ స్థానం రోజు రోజుకు హాట్ సీట్ గా మారుతుంది. తెలంగాణలో ఇతర పార్లమెంట్ స్థానాలలో పోటీ ఒకలా ఉంటే వరంగల్ పార్లమెంట్ స్థానంలో మరోలా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కుల మత రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు సమాజంలో అతి తక్కువగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరి కూతురు కావ్య కు టికెట్ ఇవ్వడంపై మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు భగ్గుమన్నారు.kadiyam kavya{#}Warangal;Parliment;politics;srihari;Husband;Bharatiya Janata Party;Aroori Ramesh;television;Guntur;Andhra Pradesh;Telugu Desam Party;Congress;Parliament;Scheduled caste;jobకడియం కావ్య కాదు...కావ్యా నజీర్...?కడియం కావ్య కాదు...కావ్యా నజీర్...?kadiyam kavya{#}Warangal;Parliment;politics;srihari;Husband;Bharatiya Janata Party;Aroori Ramesh;television;Guntur;Andhra Pradesh;Telugu Desam Party;Congress;Parliament;Scheduled caste;jobFri, 12 Apr 2024 11:14:00 GMTవరంగల్ పార్లమెంట్ స్థానం రోజు రోజుకు హాట్ సీట్ గా మారుతుంది. తెలంగాణలో ఇతర పార్లమెంట్ స్థానాలలో పోటీ ఒకలా ఉంటే వరంగల్ పార్లమెంట్ స్థానంలో మరోలా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కుల మత రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు సమాజంలో అతి తక్కువగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరి కూతురు కావ్య కు టికెట్ ఇవ్వడంపై మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు భగ్గుమన్నారు ఇప్పుడు కడియం కావ్య భర్త ముస్లిం అంటూ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆరూరి రమేష్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తన ప్రధాన అభ్యర్థి కడియం కావ్య కాదని గుంటూరు నుండి వచ్చిన కావ్య నజీర్ అంటూ కామెంట్ చేశారు తెలంగాణకు చెందిన వరంగల్ పిట్ట ఆరు రమేష్ కావాలా ఆంధ్రప్రదేశ్ గుంటూరు కు చెందిన కావ్య నజీర్ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని అన్నారు కడియం ఫ్యామిలీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు తెలుగుదేశం టిఆర్ఎస్ కాంగ్రెస్ అధిక శాతం ఉన్న మాదిగ మాల బిడ్డలకు రాని అవకాశాలు సమాజంలో 0.1 శాతం ఉన్న కడియం ఫ్యామిలీకి ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు కడియం కావ్య శ్రీహరి కూతురు కాబట్టి వారసురాలు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కావ్యను వారసురాలు అనలేమని ఆమె అత్తగారి ఇంటికి వెళ్లిపోయింది కాబట్టి గుంటూరు కాఫీ అని పేర్కొన్నారు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సమరాన్ని ఆంధ్ర తెలంగాణకు చెందిన పోటీగా తన భావిస్తున్నట్టు ఆరూరి రమేష్ స్పష్టం చేశారు మోడీ చరిష్మాతో మరోసారి పార్లమెంటు ఎన్నికల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా టిఆర్ఎస్ నుండి కీలక నేతలు వెళ్లిపోవడానికి కడియం శ్రీహరి అంటూ ఆరోపించారు ఈ విషయం బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు తెలిస్తే కడియం శ్రీహరిని పక్కన పెట్టుకునే వాడే కాదని అన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆరూరి రమేష్ చేసిన వ్యాఖ్యలు సంచనంగా మారాయి దీనిపై ఇంటర్వ్యూలో కడియం శ్రీహరి స్పందించారు తాను హిందువు అని తన కూతురు కావ్య కూడా హిందువు అని చెప్పారు తన కూతురుకు ఎస్సీ రిజర్వేషన్ తోనే మెడికల్ సీట్ వచ్చిందని ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పారు త్వరలోనే అన్ని ఆధారాలు బయటపెడతామని అన్నారు కానీ అల్లుడిపై మాత్రం కడియం శ్రీహరి స్పందించలేదు. దీంతో ఆయన ఎలాంటి వివరణ ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>