PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/akepati-maarnathreddy-rajampet-mallikarjun-mithon-reddy-8f40eb86-dbd5-442b-9802-d2bd2f22e2e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/akepati-maarnathreddy-rajampet-mallikarjun-mithon-reddy-8f40eb86-dbd5-442b-9802-d2bd2f22e2e2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని ఓకేత్తు అయితే కడప జిల్లా రాజకీయాలు మరో ఎత్తు అనేలా ఉంటాయి. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం రాజంపేట. ఈ నియోజకవర్గ వైసీపీ సీట్ కోసం ఎంతోమంది పోటీపడ్డారు. కానీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డిని కాదని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. కానీ ఆకేపాటి మాత్రం ఆ నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండడం లేదట. గెలిచే అవకాశం ఉన్నా కానీ గెలుపుకు ఆమడ దూరం వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో టిడిపి పార్టీలో వakepati maarnathreddy;rajampet;mallikarjun;mithon reddy {#}Mithoon;mallikarjun;Amarnath Cave Temple;Abhimanyu Mithun;Rajampet;kadapa;MLA;Party;politics;Jagan;YCP;TDPరాజంపేట: వైసీపీకి "ఆకేపాటి" పోటు.!రాజంపేట: వైసీపీకి "ఆకేపాటి" పోటు.!akepati maarnathreddy;rajampet;mallikarjun;mithon reddy {#}Mithoon;mallikarjun;Amarnath Cave Temple;Abhimanyu Mithun;Rajampet;kadapa;MLA;Party;politics;Jagan;YCP;TDPFri, 12 Apr 2024 15:15:12 GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని ఓకేత్తు అయితే కడప జిల్లా రాజకీయాలు మరో ఎత్తు అనేలా ఉంటాయి. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం రాజంపేట. ఈ నియోజకవర్గ వైసీపీ సీట్ కోసం ఎంతోమంది పోటీపడ్డారు.  కానీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డిని కాదని  ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి  టికెట్ ఖరారు చేశారు. కానీ ఆకేపాటి మాత్రం  ఆ నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండడం లేదట. గెలిచే అవకాశం ఉన్నా కానీ గెలుపుకు ఆమడ దూరం వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో టిడిపి పార్టీలో విపరీతమైనటువంటి వర్గ పోరుంది..  

ఈ వర్గ పోరును అమర్నాథ్ రెడ్డి వాడుకోవడంలో విఫలమవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..  జగన్ రాజంపేట లో సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి ని కాదని ఆకేపాటికి సీటు ఇచ్చారు.  మల్లికార్జున్ రెడ్డి సోదరుడు రఘును రాజ్యసభకు పంపారు. కానీ ఇక్కడ ఆకేపాటి తీరు ఎవరికి నచ్చడం లేదట. తాజాగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎమ్మెల్యే మేడ దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆకేపాటితో పాటు తనకి కూడా మీరు మద్దతు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. నాదేముంది అని ఎమ్మెల్యే మేడ మిథున్ రెడ్డితో వ్యంగ్యంగా అన్నారట. ఓవైపు  మేడ  పార్టీకి మద్దతు చూపించకపోవడం, ఆకేపాటి జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా తీయకపోవడంతో  పార్టీ శ్రేణుల్లో కాస్త నైరాశ్యం నెలకొన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వైసిపి శ్రేణులంతా ఆకేపాటిపై అసంతృప్తితో ఉన్నారట.

 ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా డబ్బు ఎంతో కొంత ఖర్చవుతుంది. కానీ ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ మాత్రం రూపాయి కూడా జేబులోంచి తీయకుండా పార్టీ ఇచ్చిన డబ్బులు కూడా కాపాడుకొని పిసినారితనాన్ని మెయింటైన్ చేస్తున్నారట. ఈ తంతు ఇలాగే కొనసాగితే మాత్రం వైసీపీ గెలిచే రాజంపేట సీటును  చేజేతుల పాడు చేసుకున్న వారం అవుతామని వైసీపీ కిందిస్థాయి నాయకులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధిష్టానం స్పందించి ఆకేపాటిని యాక్టివ్ చేస్తుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>