PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sudeer-reddy-scv-noidu-srikalahasthi-cbn-tdp-88d54fd9-ad67-4767-86d2-ad0eb28b59f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sudeer-reddy-scv-noidu-srikalahasthi-cbn-tdp-88d54fd9-ad67-4767-86d2-ad0eb28b59f2-415x250-IndiaHerald.jpgఎలక్షన్స్ వచ్చాయంటే నాయకుల మధ్య అలకలు బుజ్జగింపులు, పెడబొబ్బలు ఇలా ఎన్నో రకాలుగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇదే తంతు కొనసాగుతోంది. టికెట్ వచ్చిన వ్యక్తులు ప్రచారంలో మునిగిపోతూ ఉంటే, రాని వ్యక్తులు కాస్త బాధతో ఉంటారు. ఇలాంటి సమయంలోనే పై స్థాయి నాయకులు టికెట్ రాని వ్యక్తులని పిలిచి రకరకాల హామీలు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగానే తిరుపతి శ్రీకాళహస్తి నియోజకవర్గం లో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. అధినాయకుడు చంద్రబాబు బుజ్జగించిన కానీ ఫలితాలు రావడం లేదు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందsudeer reddy ;scv noidu;srikalahasthi;cbn;tdp;{#}sudigali sudheer;Bojjala Gopala Krishna Reddy;Bojjala Venkata Sudhir Reddy;Telugu Desam Party;Congress;Kamma;Reddy;Tirupati;Minister;CBN;News;Party;TDP;Andhra Pradeshశ్రీకాళహస్తి: సుధీర్ రెడ్డికి "కమ్మ" కష్టాలు..!శ్రీకాళహస్తి: సుధీర్ రెడ్డికి "కమ్మ" కష్టాలు..!sudeer reddy ;scv noidu;srikalahasthi;cbn;tdp;{#}sudigali sudheer;Bojjala Gopala Krishna Reddy;Bojjala Venkata Sudhir Reddy;Telugu Desam Party;Congress;Kamma;Reddy;Tirupati;Minister;CBN;News;Party;TDP;Andhra PradeshFri, 12 Apr 2024 15:41:34 GMTఎలక్షన్స్ వచ్చాయంటే  నాయకుల మధ్య అలకలు బుజ్జగింపులు, పెడబొబ్బలు ఇలా ఎన్నో రకాలుగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇదే తంతు కొనసాగుతోంది. టికెట్  వచ్చిన వ్యక్తులు ప్రచారంలో మునిగిపోతూ ఉంటే, రాని వ్యక్తులు  కాస్త బాధతో ఉంటారు. ఇలాంటి సమయంలోనే పై స్థాయి నాయకులు టికెట్ రాని వ్యక్తులని పిలిచి రకరకాల హామీలు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగానే తిరుపతి శ్రీకాళహస్తి నియోజకవర్గం లో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. అధినాయకుడు చంద్రబాబు బుజ్జగించిన కానీ ఫలితాలు రావడం లేదు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అయ్యా అంటే..  

చంద్రబాబుకు సన్నిహితులైనటువంటి మాజీ మంత్రి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల గోపాలకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు అయిన సుధీర్ రెడ్డికి టిడిపి టికెట్ ఇచ్చారు. కానీ గతంలో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఎన్సివి నాయుడు  గత కొంత కాలం కిందట వైయస్సార్ పార్టీని వీడి టిడిపిలో చేరి టికెట్టు ఆశించారు. కానీ చంద్రబాబు ఈయనను పక్కనపెట్టి  సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో  అసంతృప్తి మొదలైంది. దీంతో ఎన్సివి నాయుడు  కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదట. ఇదే తరుణంలో చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ నిర్వహించిన సమయంలో  శ్రీకాళహస్తిలో బస చేసి ఎన్సివి నాయుడుకు సర్ది చెప్పినా కానీ, పట్టించుకోకుండా ఎన్సివి నాయుడు  బెట్టు మీద ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి ఎంత బ్రతిమిలాడినా ఆయన తన పట్టు విడడం లేదట.

 వెళ్ళు నేను ప్రచారానికి వస్తా అని చెప్పి ఇంట్లోనే ఉంటున్నారట. ఇక ఈయనే కాకుండా ఈయనతో పాటు కమ్మ సామాజిక వర్గం కూడా గుబానంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలో ఒక ప్రచారం కూడా సాగుతోంది. ఇదే నియోజకవర్గంలో  తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించినటువంటి రాజేష్ నాయుడు టికెట్ దక్కకపోయేసరికి కాంగ్రెస్ బరిలో ఉన్నారట. అయితే రాజేష్ నాయుడుకి కూడా టికెట్ ఇప్పించింది ఎన్సివి నాయుడు అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  దీంతో కమ్మ ఓట్లన్నీ రాజేష్ నాయుడుకు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.  ఈ విధంగా టిడిపిలో ఏర్పడినటువంటి అసంతృప్తి వల్ల  ఇక్కడ సుధీర్ రెడ్డి గెలుపు కష్టమే అన్నట్టు ప్రచారం సాగుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>