PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-assembly-elections-2024bc0fe05b-3def-4d6d-9c7f-b1200f66bab7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-assembly-elections-2024bc0fe05b-3def-4d6d-9c7f-b1200f66bab7-415x250-IndiaHerald.jpg* వైసీపీ నేతలపై విజయసాయి షాకింగ్ కామెంట్స్ * విశాఖ వదిలి వెళ్లినందుకు బాధపడుతున్న విజయసాయి * ప్రస్తుతం నెల్లూరే తన లక్ష్యం అంటున్న విజయసాయి విజయసాయిరెడ్డి వైసీపీలో ఎంత ముఖ్యమైన నాయకుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన వైసీపీ పార్టీకి పిల్లర్ లాంటి వారు. 2019 ఎన్నికల ముందు విశాఖలో ఉండేవారు. విశాఖలో పార్టీని బాగా పటిష్టం చేశారు.2014లో వైసీపీకి మొత్తం 34 ఎమ్మెల్యే సీట్లు మాత్రేమ వస్తే 2019 నాటికి ప్రత్యర్ధి టీడీపీకి ఆ తొమ్మిది కూడా రాకAP Elections 2024{#}Coronavirus;Cricket;Vishakapatnam;Nellore;Hanu Raghavapudi;TDP;job;YCP;MLA;Partyవైసీపీపై నెగెటివిటీ పెంచుతున్న విజయసాయిరెడ్డి కామెంట్స్?వైసీపీపై నెగెటివిటీ పెంచుతున్న విజయసాయిరెడ్డి కామెంట్స్?AP Elections 2024{#}Coronavirus;Cricket;Vishakapatnam;Nellore;Hanu Raghavapudi;TDP;job;YCP;MLA;PartyFri, 12 Apr 2024 11:35:17 GMT* వైసీపీ నేతలపై విజయసాయి షాకింగ్ కామెంట్స్
* విశాఖ వదిలి వెళ్లినందుకు బాధపడుతున్న విజయసాయి  
* ప్రస్తుతం నెల్లూరే తన లక్ష్యం అంటున్న విజయసాయి  

విజయసాయిరెడ్డి వైసీపీలో ఎంత ముఖ్యమైన నాయకుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన వైసీపీ పార్టీకి పిల్లర్ లాంటి వారు. 2019 ఎన్నికల ముందు విశాఖలో ఉండేవారు. విశాఖలో పార్టీని బాగా పటిష్టం చేశారు.2014లో వైసీపీకి మొత్తం 34 ఎమ్మెల్యే సీట్లు మాత్రేమ వస్తే 2019 నాటికి ప్రత్యర్ధి టీడీపీకి ఆ తొమ్మిది కూడా రాకుండా చేయగలిగారు విజయసాయిరెడ్డి. మొత్తం ఉత్తరాంధ్రాలో వైసీపీ గెలిచేలా చేయడంతో విజయసాయిరెడ్డి వ్యూహం అద్భుతం అని అంతా అంటారు. విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు. అసలు విశాఖ సిటీ అంటే టీడీపీకి కంచుకోట. 2019లో నాలుగు సీట్లు సిటీలో ఉన్నవి వైసీపీ గెలుచుకుంది. అలాంటి చోట 2021 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో విశాఖ కార్పోరేషన్ ని వైసీపీ పరం చేశారు. వీటి వెనకాల విజయసాయిరెడ్డి ఆలోచనలతో పాటు ఆశలు కూడా ఉన్నాయని వైసీపీ ఫ్యాన్స్ అనుకునేవారు.ఇక విజయసాయిరెడ్డి విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. నిజంగా ఆయన పోటీ చేసి ఉంటే పెర్ఫెక్ట్ క్యాండిడేట్ గా సెట్ అయ్యేవారు. అయితే ఆయన విశాఖ నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఓ ఇంటర్వ్యూలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలే చేశారు.


తాను విశాఖ నుంచి వెళ్లాలనుకోలేదు తనను పంపించేసారని ఆయన అన్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలతో కలసి వైసీపీ నేతలు కూడా కుట్ర పన్నారు అంటూ సొంత పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. ఇపుడు ఆయన చేసిన కామెంట్స్ కూడా వైసీపీపై నెగెటివిటీ పెంచుతున్నాయి. విశాఖలో నేను ప్రతీ గడపా తిరిగా, ప్రతీ వీధిలోనూ తిరిగాను, యువత కోసం క్రికెట్ టోర్నమెంట్లు పెట్టాను, విశాఖలో జాబ్ మేళాలు ఎన్నో పెట్టానని విజయసాయి వివరించారు.అంతేగాక కరోనా టైం లో ఏకంగా విశాఖలో ఒక ఆసుపత్రినే నడిపాను అని ఆయన అన్నారు. ఇంత చేసిన తనను విశాఖ నుంచి తప్పించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సొంత పార్టీ నేతలు ఉన్నారని ఆయన అనడంతో వైసీపీలో ఇలాంటి నేతలు కూడా ఉన్నారా అని నెగెటివిటీ పెరుగుతుంది. విజయసాయిరెడ్డి విశాఖ వదిలేసి  ఇపుడు నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. నెల్లూరు ఎంపీగా గెలుపు కోసం శ్రమిస్తున్నారు.సడెన్ గా విశాఖ ప్రస్తావన తెచ్చి అక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నానని చెప్పడం ఒక విషయం అయితే సొంత పార్టీ నేతలు కుట్ర చేశారని చెప్పడం ఆ పార్టీకి ఒక మచ్చలా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>