Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brsdc88b492-a561-4488-9ec5-4978b7e89d6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brsdc88b492-a561-4488-9ec5-4978b7e89d6d-415x250-IndiaHerald.jpgగత అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే ఇక పార్టీలోని కీలక నేతలు అందరికీ కూడా ఎంపీ టికెట్లు ఇచ్చింది అన్న విషయం తెలిసిందే అయితే వరంగల్ పార్లమెంట్ స్థానం విషయంలో మాత్రం ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది ఏకంగా పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న కడియం శ్రీహరి కూతురు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం కావ్య కు వరంగల్ ఎంపీ టికెట్ ను కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఆమె అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడమే కాదు. పTg{#}Peddi Sudarshan Reddy;KCR;srihari;Warangal;Assembly;Telangana;sudigali sudheer;MP;Party;MLA;Joseph Vijay;Dalapathi;Congressఎంపీ సీటు విషయంలో.. ఆ నేతకు బిగ్ షాక్ ఇచ్చిన కేసీఆర్?ఎంపీ సీటు విషయంలో.. ఆ నేతకు బిగ్ షాక్ ఇచ్చిన కేసీఆర్?Tg{#}Peddi Sudarshan Reddy;KCR;srihari;Warangal;Assembly;Telangana;sudigali sudheer;MP;Party;MLA;Joseph Vijay;Dalapathi;CongressFri, 12 Apr 2024 18:30:00 GMTఅసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే ఇక పార్టీలోని కీలక నేతలు అందరికీ కూడా ఎంపీ టికెట్లు ఇచ్చింది అన్న విషయం తెలిసిందే  అయితే వరంగల్ పార్లమెంట్ స్థానం విషయంలో మాత్రం ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది  ఏకంగా పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న కడియం శ్రీహరి  కూతురు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం కావ్య కు వరంగల్ ఎంపీ టికెట్ ను కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ.


కానీ ఆమె అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడమే కాదు. పార్టీ నుంచి కూడా తప్పుకున్నారు అయితే కడియం కావ్య తీసుకున్న నిర్ణయంతో ఇక వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒకరకంగా బిఆర్ఎస్ పార్టీ కుప్పకూలినంత పని అయింది. ఇక కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి తప్పుకుని అదే వరంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. దీంతో ఇక వరంగల్ ఎంపీ సీటు ఎవరికి ఇవ్వాలి అనే విషయం పై బీఆర్ఎస్ లో తర్జనభజన మొదలైంది. అయితే కడియం కావ్య పోటీ నుంచి తప్పుకోవడంతో ఉద్యమకారులు తమకే టికెట్ కేటాయించాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై ఒత్తిడి తెచ్చారంటు ప్రచారం జరిగింది.


తాటికొండ రాజయ్య పేరుతో పాటు కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న పరంజ్యోతిని మళ్ళీ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగిన పెద్ది సుదర్శన్ రెడ్డి సైతం ఆయన భార్యను వరంగల్ ఎంపీ బరిలో దింపాలని అనుకున్నారట. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే విషయంపై గులాబీ దళపతి కేసీఆర్  కు పెద్ద తలనొప్పి మొదలైంది. అయితే ఇక ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని పార్టీ అధినేత కేసిఆర్ ప్రకటించారు. అయితే వరంగల్ ఎంపీ సీటు తనకే దక్కుతుందని ధీమాతో ఉన్న తాటికొండ  రాజయ్యకు బిగ్ షాక్ తగిలింది   తెలంగాణ ఉద్యమకారుడు హనుమకొండ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న మారేపల్లి సుధీర్ కుమార్ కి వరంగల్ ఎంపీ టికెట్ ను ఖరారు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఈ విషయాన్ని గులాబీ పార్టీ అధిపతి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>