Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli781737a1-0de3-48bc-b59b-3e6a105aba10-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli781737a1-0de3-48bc-b59b-3e6a105aba10-415x250-IndiaHerald.jpgటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటి రోజుల్లో కోహ్లీ క్రికెట్లో ఎలా అయితే స్టార్ గా కొనసాగుతూ వున్నాడో.. ఇక సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవడంలోనూ సోషల్ మీడియా స్టార్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. తన అటు తీరుతో యాటిట్యూడ్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కోహ్లీ.. మిగతా స్టార్ క్రికెటర్లతో పోల్చి చూస్తే రికార్డుల విషయంలోనే కాదు ఫాలోవర్ల విషయంలో కూడా అందనంత దూరంలో ఉన్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఎప్పుడు బ్యాటKohli{#}gautham new;gautham;Masala;Manam;Lucknow;media;VIRAT KOHLIఫ్యాన్స్ కి ఎప్పుడు మసాలా కావాలి.. కోహ్లీ కీలక వ్యాఖ్యలు?ఫ్యాన్స్ కి ఎప్పుడు మసాలా కావాలి.. కోహ్లీ కీలక వ్యాఖ్యలు?Kohli{#}gautham new;gautham;Masala;Manam;Lucknow;media;VIRAT KOHLIFri, 12 Apr 2024 06:40:00 GMTటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటి రోజుల్లో కోహ్లీ క్రికెట్లో ఎలా అయితే స్టార్ గా కొనసాగుతూ వున్నాడో.. ఇక సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవడంలోనూ  సోషల్ మీడియా స్టార్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. తన అటు తీరుతో యాటిట్యూడ్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కోహ్లీ.. మిగతా స్టార్ క్రికెటర్లతో పోల్చి చూస్తే రికార్డుల విషయంలోనే కాదు ఫాలోవర్ల విషయంలో కూడా అందనంత దూరంలో ఉన్నాడు.


 అయితే విరాట్ కోహ్లీ ఎప్పుడు బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగిన పరుగుల వరద పారీస్తూ ఉంటాడు. ఇక అతను బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు ప్రత్యర్థి బౌలర్లు సైతం భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా కోహ్లీ తన బ్యాటింగ్ ఎలా అయితే వార్తల్లో నిలుస్తూ ఉంటాడో.. కొన్ని కొన్ని సార్లు వివాదాలతో కూడా వార్తలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు. ప్రత్యర్ధులతో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ గొడవలు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఐపీఎల్లో అప్పటి లక్నో టీం మెంటర్ గౌతమ్ గంభీర్, ఆ జట్టు బౌలర్ నవీన్ ఉల్ హక్ తో కోహ్లీ గొడవ ఎంత వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 అయితే ఈ గొడవ తర్వాత గంభీర్, కోహ్లీ ఎప్పుడు ఎదురుపడిన కూడా అందరూ ఏం జరుగుతుందో అని కళ్ళు పెద్దవి చేసి మరి చూసేవారు. ఇక నవీన్ ఉల్హాక్, కోహ్లీ ఎదురుపడినప్పుడు కూడా ఇదే జరిగేది  కానీ ఇటీవలే ఐపీఎల్లో మాత్రం గంభీర్, నవీన్ ఉల్ హక్ లను కోహ్లీ హగ్ చేసుకున్నాడు. మన మధ్య ఇక గొడవలు ఏం లేవు అన్నట్లుగా మాట్లాడుకున్నారు. ఇదే విషయంపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను గంభీర్, నవీన్ లను హగ్ చేసుకోవడంతో ఫాన్స్ నిరూత్సాహపడ్డారు అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అభిమానులకు ఎప్పుడు మసాలా కావాలి. నేను హగ్ చేసుకోవడంతో మసాలా అయిపోయిందని ఫాన్స్ అనుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. నేను అరంగేట్రం చేసినప్పుడు నాలుగు ఐదు మ్యాచ్లు ఆడకపోతే ఉద్వాసన  పలికేవారు. ఆ నాలుగు, ఐదు మ్యాచ్లలోనే  మనం ఏంటో నిరూపించుకోవాలి. కానీ ఇప్పుడు అలా లేదు. ఎన్నో మ్యాచ్లు ఆడొచ్చు. ఫాన్స్ మద్దతుగా నిలుస్తూ ఉంటారు అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>