MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya62059293-6df7-4172-a6c0-93ba27781ec4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya62059293-6df7-4172-a6c0-93ba27781ec4-415x250-IndiaHerald.jpgఅజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఎక్స్ 100" మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన కార్తికేయ మొదటి మూవీతోనే మంచి విజయాన్ని అందుకొని నటుడిగా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను తెలుగు పరిశ్రమలో ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ఈయన పలు సినిమాలలో హీరోగా నటించినప్పటికీ అందులో ఏవి పెద్దగా విజయాలను సాధించలేదు. ఆఖరుగా ఈ నటుడు "బెదురులంక 2012" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... క్లాక్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కార్తికేయ కు బాక్స్ ఆఫీస్ karthikeya{#}aishwarya;neha shetty;prasanth;Hero;Heroine;Posters;Josh;V;Prashant Kishor;karthikeya;kartikeya;Cinema;Telugu;Box office"కార్తికేయ" లేటెస్ట్ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!"కార్తికేయ" లేటెస్ట్ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!karthikeya{#}aishwarya;neha shetty;prasanth;Hero;Heroine;Posters;Josh;V;Prashant Kishor;karthikeya;kartikeya;Cinema;Telugu;Box officeFri, 12 Apr 2024 14:04:34 GMTఅజయ్ భూపతి దర్శకత్వం లో రూపొందిన "ఆర్ ఎక్స్ 100" మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన కార్తికేయ మొదటి మూవీతోనే మంచి విజయాన్ని అందుకొని నటుడి గా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను తెలుగు పరిశ్రమలో ఏర్పరచు కున్నాడు. ఆ తర్వాత ఈయన పలు సినిమాలలో హీరో గా నటించినప్పటికీ అందులో ఏవి పెద్దగా విజయాలను సాధించలేదు .  ఆఖరుగా ఈ నటుడు "బెదురులంక 2012" అనే సినిమాలో హీరో గా నటించాడు. 

మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించ గా ... క్లాక్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కార్తికేయ కు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించింది . బెదురు లంక 2012 మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్న కార్తికేయ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ తాజాగా విడుదల అయ్యింది. కార్తికేయ ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది.

మూవీ కి "భజే వాయు వేగం" అనే టైటిల్ ను ఈ మూవీ యూనిట్ ఖరారు చేస్తూ కార్తికేయ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది . ప్రస్తుతం అది వైరల్ అవుతుంది . ఈ మూవీ కి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఐశ్వర్య మీనన్ ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించనుంది . యు వి కాన్సెప్ట్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీ విడుదల తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>