MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannaa612f94b-ea4f-49f4-bddd-b33b7f001a45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannaa612f94b-ea4f-49f4-bddd-b33b7f001a45-415x250-IndiaHerald.jpgమిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతుంది. ఈమె కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా ఇండియాలో ఉన్న దాదాపు అన్ని భాషల సినిమాలలో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈమె తమిళ్ లో రూపొందుతున్న "అరుణ్మనై 4" సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుందర్ సి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి రాశి కన్నా కూడా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే "అరుణ్మనై" సtamanna{#}BEAUTY;Suresh;raasi;sundar c;tamannaah bhatia;cinema theater;Kollywood;Posters;Beautiful;Tamil;Telugu;Cinemaఆ క్రేజీ మూవీ నుండి "తమన్నా" ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!ఆ క్రేజీ మూవీ నుండి "తమన్నా" ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!tamanna{#}BEAUTY;Suresh;raasi;sundar c;tamannaah bhatia;cinema theater;Kollywood;Posters;Beautiful;Tamil;Telugu;CinemaThu, 11 Apr 2024 11:26:15 GMTమిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతుంది. ఈమె కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా ఇండియాలో ఉన్న దాదాపు అన్ని భాషల సినిమాలలో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈమె తమిళ్ లో రూపొందుతున్న "అరుణ్మనై 4" సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుందర్ సి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి రాశి కన్నా కూడా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. 

ఇప్పటికే "అరుణ్మనై" సిరీస్ లో భాగంగా వచ్చిన మూడు మూవీ లు కూడా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. ఇక ఈ సిరీస్ మూవీ లు తెలుగు లో వేరు వేరు పేర్లతో విడుదల అయ్యాయి. అందులో కొన్ని విజయాలను సాధించగా ... మరికొన్ని ప్రేక్షకులను నిరుత్సాహ పరిచాయి. ఇకపోతే "అరుణ్మనై 4" సినిమా కూడా తెలుగు లో విడుదల కానుంది .ఈ సినిమా తెలుగు లో "బాక్" అనే పేరుతో విడుదల కానుంది.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని కూడా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాలోని తమన్నా క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో భాగంగా ఈ సినిమాలో తమన్నా "శివాని" పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమాబ్యూటీ కి ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>