HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/potassium67b34884-44e0-4577-be8c-06a80536f7e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/potassium67b34884-44e0-4577-be8c-06a80536f7e6-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రజలు ఏ చిన్న పని చేసినా సరే త్వరగా అలసిపోతూ ఉంటారు. ఇలా జరగడానికి కారణం ఏమిటి అంటే రకరకాల కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పొటాషియం లోపం కూడా ఒకటి.. మన శరీరంలో సరైన నిష్పత్తిలో పొటాషియం లేకపోవడం వల్ల కూడా బలహీనత అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.. ఫలితంగా కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. అలాగే గుండె కొట్టుకోవడం అసాధారణంగా ఉంటుంది.. కాబట్టి ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే సరైన మోతాదులో శరీరంలో పొటాషియం ఉండాలి . మరి పొటాషియం లోపిస్తే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. POTASSIUM{#}Potassium;Beans;Heartశరీరంలో పొటాషియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా..?శరీరంలో పొటాషియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా..?POTASSIUM{#}Potassium;Beans;HeartThu, 11 Apr 2024 06:00:00 GMTప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రజలు ఏ చిన్న పని చేసినా సరే త్వరగా అలసిపోతూ ఉంటారు. ఇలా జరగడానికి కారణం ఏమిటి అంటే రకరకాల కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పొటాషియం లోపం కూడా ఒకటి.. మన శరీరంలో సరైన నిష్పత్తిలో పొటాషియం లేకపోవడం వల్ల కూడా బలహీనత అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.. ఫలితంగా కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. అలాగే గుండె కొట్టుకోవడం అసాధారణంగా ఉంటుంది.. కాబట్టి ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే సరైన మోతాదులో శరీరంలో పొటాషియం ఉండాలి . మరి పొటాషియం లోపిస్తే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

వైట్ బీన్స్.. ముఖ్యంగా వైట్ బీన్స్ లో మనకు పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. అలాగే 1/2 కప్పు వైట్ బీన్స్ లో మనకు 421 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.. కాబట్టి ఈ వైట్ బీన్స్ తినడం వల్ల అలసట,  నీరసత్వం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. వైట్ బీన్స్ తో పాటు చిలకడదుంప కూడా మీకు శరీరానికి కావాల్సిన పొటాషియం నిల్వలను అందిస్తుంది. ప్రస్తుత కాలంలో ఎక్కువగా చిలకడ దుంపలు లభిస్తున్నాయి కాబట్టి మీరు నిర్మొహమాటంగా వీటిని తినవచ్చు అయితే ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు రోజుకు కావాల్సినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.. లేకపోతే చిలకడదుంపలు ఎక్కువగా తినడం వల్ల తిమ్మిరి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయట. కానీ తగిన మోతాదు లో క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే శరీరంలో పొటాషియం తగ్గకుండా ఉంటుంది. అలాగే బచ్చలి కూరలో కూడా మీకు పొటాషియం లభిస్తుంది. ఒక కప్పు బచ్చలి కూరలో 839 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అలాగే టమాటో సాస్ , టొమాటో ఉత్పత్తులలో కూడా మీకు పొటాషియం లభిస్తుంది.

వీటితోపాటు ఒక అరటి పండులో 451 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. ఇది మానవ శరీరంలోని అలసటను దూరం చేసి తిరిగి శరీరం శక్తిని పుంజుకునేలా చేస్తుంది. 150 గ్రాముల అవకాడోలు 1120 మిల్లీగ్రాములు పొటాషియం లభిస్తుంది. ఇక వీటితోపాటు కొబ్బరి నీరు కూడా మీరు తీసుకుంటూ ఉంటే అలసట,  నీరసం దూరం అయిపోతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>