PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cbns-spirited-poll-promise9d6e5576-9f17-4210-8369-ffe90ebe2dae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cbns-spirited-poll-promise9d6e5576-9f17-4210-8369-ffe90ebe2dae-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కూటమి సొంతమవుతుందో వైసీపీ సొంతమవుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎన్నికలు పూర్తై ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యే వరకు వేర్వేరు సంస్థల ప్రీ పోల్ సర్వేల ఫలితాలను బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అంచనా వేయడం జరుగుతుంది. అయితే ఒక్కో సర్వే ఫలితాలు ఒక్కో పార్టీకి ఫేవర్ గా ఉండటంతో స్పష్టంగా ఏ పార్టీది అధికారమో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది. chandrababu naidu{#}96;Vishakapatnam;Survey;TDP;YCP;Elections;News;Partyఏపీ : బాబుకు వణుకు పుట్టిస్తున్న ఆత్మసాక్షి లేటెస్ట్ సర్వే.. గెలుపు కష్టమేనా?ఏపీ : బాబుకు వణుకు పుట్టిస్తున్న ఆత్మసాక్షి లేటెస్ట్ సర్వే.. గెలుపు కష్టమేనా?chandrababu naidu{#}96;Vishakapatnam;Survey;TDP;YCP;Elections;News;PartyThu, 11 Apr 2024 00:37:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కూటమి సొంతమవుతుందో వైసీపీ సొంతమవుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎన్నికలు పూర్తై ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యే వరకు వేర్వేరు సంస్థల ప్రీ పోల్ సర్వేల ఫలితాలను బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అంచనా వేయడం జరుగుతుంది. అయితే ఒక్కో సర్వే ఫలితాలు ఒక్కో పార్టీకి ఫేవర్ గా ఉండటంతో స్పష్టంగా ఏ పార్టీది అధికారమో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది.
 
ఆత్మసాక్షి సంస్థ తాజాగా మరోసారి సర్వే ఫలితాలను ప్రకటించగా ఈ సర్వే ఫలితాలు బాబుకు వణుకు పుట్టించేలా ఉన్నాయి. ఏపీలో 48.75 శాతం ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఉండగా 46.75 శాతం ఓటర్లు కూటమికి అనుకూలంగా ఉన్నారని సర్వే లెక్కల ద్వారా వెల్లడైంది. 2.5 శాతం ఓటర్లు మాత్రం ఏ పార్టీకి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపినట్టు ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. 96 నుంచి 106 స్థానాలలో విజయం సాధించి ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆత్మసాక్షి సర్వే అంచనా వేస్తుండటం గమనార్హం.
 
టీడీపీకి 63 నుంచి 69 స్థానాలు వచ్చే అవకాశం ఉందని మిగతా స్థానాలలో పోటాపోటీ ఉండనుందని ఆత్మసాక్షి అంచనా వేస్తోంది. రూరల్ ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఉండగా అర్బన్ ఓటర్లు కూటమికి అనుకూలంగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. శ్రీకాకుళంలో వైసీపీకి 5, కూటమికి 4 స్థానాల్లో విజయం దక్కుతుందని ఒక స్థానంలో హోరాహోరీ పోరు ఉంటుందని విజయనగరంలో వైసీపీకి 6 కూటమికి 2 స్థానాలు వస్తాయని మరో స్థానంలో గట్టి పోటీ ఉంటుందని తెలుస్తోంది.
 
విశాఖ విషయానికి వస్తే వైసీపీకి 7 స్థానాలు, కూటమికి 7 స్థానాలు వస్తాయని ఒక స్థానంలో గట్టి పోటీ ఉంటుందని సర్వేలో వెల్లడైంది. ఈస్ట్ గోదావరిలో వైసీపీకి 8, కూటమికి 9 స్థానాలలో విజయం దక్కుతుందని 2 స్థానాలలో హోరాహోరీ పోరు ఉంటుందని వెస్ట్ గోదావరిలో వైసీపీకి 7, కూటమికి 7 స్థానాలు వస్తాయని ఒక స్థానంలో గట్టి పోటీ ఉంటుందని సమాచారం. కృష్ణాలో వైసీపీకి 8, కూటమికి 6 స్థానాలు వస్తాయని 2 స్థానాలలో టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
 
గుంటూరులో వైసీపీకి 8, కూటమికి 7 స్థానాలు వస్తాయని మిగతా 2 స్థానాలలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేమని ఆత్మసాక్షి చెబుతోంది. ప్రకాశంలో వైసీపీ 7 స్థానాలలో కూటమి 5 స్థానాలలో విజయం సాధిస్తాయని తెలుస్తోంది. నెల్లూరులో 2 స్థానాలలో టఫ్ ఫైట్ ఉంటుందని కూటమి, వైసీపీలకు చెరో 4 స్థానాలు వస్తాయని సమాచారం. రాయలసీమలో మాత్రం వైసీపీకే అనుకూల ఫలితాలు వస్తాయని ఈ సర్వే చెబుతోంది.
 
కర్నూలులో వైసీపీ 10 స్థానాలలో, టీడీపీ 3 స్థానాలలో గెలిచే ఛాన్స్ ఉంటుందని ఒక స్థానంలో మాత్రం గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. కడపలో వైసీపీ 8 స్థానాలలో విజయం సాధిస్తుందని ఒక స్థానంలో టీడీపీకి విజయావకాశాలు ఉండగా ఒక స్థానంలో మాత్రం హోరాహోరీ పోరు ఉంటుందని భోగట్టా. అనంతపురంలో వైసీపీకి 9, టీడీపీకి 4 స్థానాలలో అనుకూల ఫలితాలు వస్తాయని ఒక స్థానంలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేమని తెలుస్తోంది. చిత్తూరులో 9 స్థానాలలో వైసీపీ జెండా ఎగిరే ఛాన్స్ ఉందని టీడీపీ 4 స్థానాలలో గెలుస్తుందని ఒక స్థానంలో టఫ్ ఫైట్ ఉందని సమాచారం. ఆత్మసాక్షి సంస్థ ఉమ్మడి జిల్లాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే ఫలితాలను వెల్లడించింది.
 
 
 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>