Technologypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobiles9b554d4d-cb0a-47be-b851-5f1271570e38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobiles9b554d4d-cb0a-47be-b851-5f1271570e38-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో వినియోగదారులను ఆకట్టుకుని తమ మార్కెట్ను పెంచుకోవడమే లక్ష్యంగా ఎన్నో రకాల మొబైల్ కంపెనీలు ప్రయత్నిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు అతి తక్కువ ధరలకే అధునాతనమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ.. కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయ్. అయితే ఇలా మార్కెట్లో ఎన్నో రకాల మొబైల్ కంపెనీలు ఉన్నప్పటికీ యాపిల్ కంపెనీ మొబైల్స్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఐఫోన్ తమ అంటే అది ఒక గౌరవం అన్నట్లుగా నేటి రోజుల్లో యువత భావిస్తూ ఉంటారు. అయితే ఇలా యాపిల్ ఐఫోన్ తర్వాత మార్కMobiles{#}Smart phone;iPhone;Director;Tamilnadu;Maharashtra;vegetable market;Letter;Indian;Teluguతెలుగు రాష్ట్రాల్లో.. ఇక వన్ ప్లస్ మొబైల్స్ కనిపించకపోవచ్చట.. ఎందుకంటే?తెలుగు రాష్ట్రాల్లో.. ఇక వన్ ప్లస్ మొబైల్స్ కనిపించకపోవచ్చట.. ఎందుకంటే?Mobiles{#}Smart phone;iPhone;Director;Tamilnadu;Maharashtra;vegetable market;Letter;Indian;TeluguThu, 11 Apr 2024 10:00:00 GMTఇటీవల కాలంలో వినియోగదారులను ఆకట్టుకుని తమ మార్కెట్ను పెంచుకోవడమే లక్ష్యంగా ఎన్నో రకాల మొబైల్ కంపెనీలు ప్రయత్నిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు అతి తక్కువ ధరలకే అధునాతనమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ.. కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయ్. అయితే ఇలా మార్కెట్లో ఎన్నో రకాల మొబైల్ కంపెనీలు ఉన్నప్పటికీ యాపిల్ కంపెనీ మొబైల్స్ కి  ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఐఫోన్  తమ అంటే అది ఒక గౌరవం అన్నట్లుగా నేటి రోజుల్లో యువత భావిస్తూ ఉంటారు.



 అయితే ఇలా యాపిల్ ఐఫోన్ తర్వాత మార్కెట్లో ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న మొబైల్ ఏదైనా ఉంది అంటే అది వన్ ప్లస్ అని చెప్పాలి. యాపిల్ ఫోన్ కొనుగోలు చేసేందుకు డబ్బులు తక్కువగా ఉన్న వినియోగదారులు అందరూ కూడా ఇక వన్ ప్లస్ ఫోన్ ని కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు. మిగతా ఫోన్లతో పోల్చి చూస్తే అద్భుతమైన ఫీచర్లు.. క్వాలిటీ కలిగి ఉండే వన్ ప్లస్ ఫోన్లు విపరీతంగా అమ్ముడుపోతూ ఉంటాయి. ఇండియాలో ఈ ఫోన్లోకి మంచి మార్కెట్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఇండియాలోని కొన్ని రాష్ట్రాలలో వన్ ప్లస్ ఫోన్లు ఇకనుంచి కనిపించపోవచ్చట. వచ్చే నెల ఒకటో తారీకు నుంచి కూడా వన్ ప్లస్ ఫోన్లు మాయం కాబోతున్నాయట.



 తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ లాంటి స్టేట్స్ లో వన్ ప్లస్ ఫోన్లు ఆఫ్లైన్ స్టోర్లలో లభించకపోవచ్చు అన్నది తెలుస్తుంది. ఆ ఫోన్ల అమ్మకాల వలన తమకు మార్జిన్లు ఉండకపోవడమే కాదు.. ఇక తమ సమస్యలను వన్ ప్లస్ పెడచెవిన  పెడుతుంది అంటూ సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అసోసియేషన్ ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇక తమ స్టోర్ లలో ఆఫ్లైన్లో వన్ ప్లస్ మొబైల్స్ ని అమ్మేది లేదు అంటూ చెప్పింది. ఈ మేరకు వన్ ప్లస్ సేల్స్ డైరెక్టర్ కు ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అసోసియేషన్ ఒక లేఖ రాసింది. దీన్ని బట్టి ఇక వచ్చే నెల ఒకటో తారీకు నుంచి ఆఫ్లైన్ స్టోర్స్ లో వన్ ప్లస్ ఫోన్లు ఇక కనిపించకపోవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>