MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dsf2bbdce1-a8c0-423e-8c96-7995a692db54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dsf2bbdce1-a8c0-423e-8c96-7995a692db54-415x250-IndiaHerald.jpgమలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కి తెలుగులో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన మలయాళ నటుడే అయినప్పటికీ నేరుగా కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు. ఈయన మొదటగా కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి అనే స్టేట్ తెలుగు సినిమాలో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం ఇందులో దుల్కర్ సల్మాన్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత ఈ నటుడు హను రాఘవపూడి దర్శకత్వంలds{#}bhaskar;dulquer salmaan;keerthi suresh;nag ashwin;seetha;surya sivakumar;Heroine;Posters;Mahanati;Venky Atluri;naga;Success;Telugu;Hanu Raghavapudi;Cinema;Hero;Baba Bhaskar"లక్కీ భాస్కర్" టీజర్ అప్డేట్ వచ్చేసింది..!"లక్కీ భాస్కర్" టీజర్ అప్డేట్ వచ్చేసింది..!ds{#}bhaskar;dulquer salmaan;keerthi suresh;nag ashwin;seetha;surya sivakumar;Heroine;Posters;Mahanati;Venky Atluri;naga;Success;Telugu;Hanu Raghavapudi;Cinema;Hero;Baba BhaskarThu, 11 Apr 2024 11:19:00 GMTమలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కి తెలుగులో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన మలయాళ నటుడే అయినప్పటికీ నేరుగా కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు. ఈయన మొదటగా కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి అనే స్టేట్ తెలుగు సినిమాలో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం ఇందులో దుల్కర్ సల్మాన్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.

ఇక ఆ తర్వాత ఈ నటుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా రూపొందిన సీత రామం అనే తెలుగు సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమాతో ఈయన తెలుగులో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. దుల్కర్ లో తెలుగులో మంచి క్రేజ్ ఉండడంతో ఈ నటుడు ప్రస్తుతం మరో తెలుగు సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ నటుడు సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మాణంలో ... వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ ను ఈన్రోజు అనగా ఏప్రిల్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో దుల్కర్ సల్మాన్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>