Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle1f9948ff-ba75-4a8c-babd-4b750303a23b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-socialstars-lifestyle1f9948ff-ba75-4a8c-babd-4b750303a23b-415x250-IndiaHerald.jpgమ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో 'ఆది' సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది.. ఈ చిత్రం తోనే ఎన్టీఆర్ తిరుగులేనిమాస్ హీరోగా ఎదిగారు. ఎన్టీఆర్‌కు హీరోగా ఆది మూవీ మూడో చిత్రం. మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడటంతో ఆది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. కెరీర్ తొలినాళ్లలోనే ఎన్టీఆర్ ను స్టార్ హీరో రేంజ్‍కు తీసుకెళ్లింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఆది సినిమా 2002లో రిలీజైంది. రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ డ్రామాగా ఆది మూవీ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్‍గా, ఫ్య#socialstars lifestyle{#}keerthi chawla;mani sharma;rajiv kanakala;Ahuti;Rayalaseema;Mass;AdiNarayanaReddy;Chitram;Jr NTR;NTR;Hero;March;Cinemaరీ రిలీజ్ కు సిద్ధం అయిన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ..!!రీ రిలీజ్ కు సిద్ధం అయిన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ..!!#socialstars lifestyle{#}keerthi chawla;mani sharma;rajiv kanakala;Ahuti;Rayalaseema;Mass;AdiNarayanaReddy;Chitram;Jr NTR;NTR;Hero;March;CinemaThu, 11 Apr 2024 06:20:41 GMTమ్యాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ కెరీర్లో 'ఆది' సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది.. ఈ చిత్రం తోనే ఎన్టీఆర్ తిరుగులేని మాస్ హీరోగా ఎదిగారు. ఎన్టీఆర్‌కు హీరోగా ఆది మూవీ మూడో చిత్రం. మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడటంతో ఆది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. కెరీర్ తొలినాళ్లలోనే ఎన్టీఆర్ ను స్టార్ హీరో రేంజ్‍కు తీసుకెళ్లింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఆది సినిమా 2002లో రిలీజైంది. రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ డ్రామాగా ఆది మూవీ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్‍గా, ఫ్యాక్షన్ లీడర్‌గా నట విశ్వరూపం చూపారు.  'ఆది' సినిమా ఇప్పడు మళ్లీ థియేటర్లలోకి రానుంది. 22 ఏళ్ల తర్వాత ఆ చిత్రం రీ-రిలీజ్ కానుంది.జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆది సినిమా రీ-రిలీజ్ కానుంది. మే 19, 20 తేదీల్లో ఈ సినిమా ప్రత్యేక షోలు థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి.

ఈ ఏడాది మే 20వ తేదీన తన 41వ పుట్టిన రోజును ఎన్టీఆర్ జరుపుకోనున్నారు. అందుకు ఒక్కరోజు ముందే మే 19న ఆది చిత్రం థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడ వచ్చింది.ఆది సినిమా 2002 మార్చి 28వ తేదీన రిలీజైంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కీర్తి చావ్లా హీరోయిన్‍గా నటించింది. ఈ చిత్రంలో ఆహుతి ప్రసాద్, చలపతి రావు, రాజన్ పీ దేవ్, అలీ, ఎల్బీ శ్రీరామ్, ఎంఎస్ నారాయణ మరియు రాజీవ్ కనకాల  కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పవచ్చు.ఆది చిత్రంలోని కొన్ని పాటలు క్లాసిక్‍గా నిలిచిపోయాయి.ఈ సినిమాలో జైలులో ఎన్టీఆర్ తొడకొట్టే సీక్వెన్స్ అలాగే రాయలసీమలో నీరు తాగే సీన్లకు మణిశర్మ ఇచ్చిన బీజిఎం అదిరిపోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>