EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababuec16e16c-43a9-449b-8251-4b9c77c0ed92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababuec16e16c-43a9-449b-8251-4b9c77c0ed92-415x250-IndiaHerald.jpgవాలంటీర్ వ్యవస్థని వైఎస్ జగన్ తెచ్చారు. దేశంలో ఎక్కడా ఇటువంటి వ్యవస్థ లేదన్న మాట నిజం. పౌర సేవలను ప్రజల ఇంటికి తీసుకెళ్లి వారికి డోర్ డెలివరీ చేయవచ్చు. గౌరవ వేతనం ఇస్తూ ఆసక్తి గత యువత సేవలను దీని కోసం వాడుకోవచ్చు అన్న ఆలచన గొప్పది. దీని వల్ల ప్రజల అవసరాలు తీరుతాయి. అలాగే యువతకు ఎంతో కంత ఉపాధి, వేతనం దక్కుతుంది. రెండిందాల లాభసాటిగా ఉన్న ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి జగన్ క్రియేటర్ అయ్యారు. ఈ విధానంతో పరిపాలనా సంస్కరణలో ఇది ముందడుగు అనే చెప్పాలి. ఈ వ్యవస్థ మీద ఎన్ని విమర్శలు ఉన్నా ప్రజలకు మాత్రం బాగాchandrababu{#}Raccha;Election Commission;CBN;Jagan;Janasena;TDPచంద్రబాబు: ఆ ఒక్క వాగ్దానంతో వాలంటీర్లంతా కూటమిలోకి?చంద్రబాబు: ఆ ఒక్క వాగ్దానంతో వాలంటీర్లంతా కూటమిలోకి?chandrababu{#}Raccha;Election Commission;CBN;Jagan;Janasena;TDPThu, 11 Apr 2024 08:00:00 GMTవాలంటీర్ వ్యవస్థని వైఎస్ జగన్ తెచ్చారు. దేశంలో ఎక్కడా ఇటువంటి వ్యవస్థ లేదన్న మాట నిజం. పౌర సేవలను ప్రజల ఇంటికి తీసుకెళ్లి వారికి డోర్ డెలివరీ చేయవచ్చు. గౌరవ వేతనం ఇస్తూ ఆసక్తి గత యువత సేవలను దీని కోసం వాడుకోవచ్చు అన్న ఆలచన గొప్పది. దీని వల్ల ప్రజల అవసరాలు తీరుతాయి. అలాగే యువతకు ఎంతో కంత ఉపాధి, వేతనం దక్కుతుంది.


రెండిందాల లాభసాటిగా ఉన్న ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి జగన్ క్రియేటర్ అయ్యారు.  ఈ విధానంతో పరిపాలనా సంస్కరణలో ఇది ముందడుగు అనే చెప్పాలి. ఈ వ్యవస్థ మీద ఎన్ని విమర్శలు ఉన్నా ప్రజలకు మాత్రం బాగా కనెక్ట్ అయింది. దీని మీద విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. జనాలు మాత్రం పట్టించుకోలేదు. ఒకానొక సమయంలో టీడీపీ మాత్రం వాలంటీర్ వ్యవస్థపై ఘాటైన విమర్శలు చేసింది.


ఇంట్లో మగవారు లేని సమయంలో వాలంటీర్లు ఇంట్లోకి ఎలా వస్తారని అక్కడ వారికి ఏం పని అని ప్రశ్నించారు. అలాగే వాలంటీర్లను ఇంట్లోకి రానీయోద్దని అని పిలుపు కూడా ఇచ్చింది. మరోవైపు జనసేన అయితే వారిని అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారని అని విమర్శలు చేసింది. దీని మీద ఆద్యంతం ఎంతో రచ్చ జరుగుతూనే వచ్చింది. ఇప్పుడు ఈసీ ఆంక్షల నేపథ్యంలో వాలంటీర్లు విధులకు దూరంగా ఉంటున్నారు. ఇది రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.


అయితే దీనిపై నష్ట నివారణ చర్యలు చేపట్టిన చంద్రబాబు తాజాగా తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లు నెలకు రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా తమ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వీరికి నెలకు రూ.10వేల గౌరవ భృతి ఇస్తామని ప్రకటించి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గతంలో అన్నేసి మాటలు అన్న చంద్రబాబు ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి.. యూ టర్న్ తీసుకొని వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పడం ఆయన అవకాశ వాదానికే చెల్లింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు మాత్రం ఇక వాలంటీర్లంతా కూటమిలో చేరిపోయినట్టేనని కలలు కంటున్నారు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>