EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagana6b9eb6d-9595-4832-892e-3540bfc3885d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagana6b9eb6d-9595-4832-892e-3540bfc3885d-415x250-IndiaHerald.jpgపదేళ్ల క్రితం గ్రామాల్లో, పట్టణాల్లో కరెంట్ కోతలు ఉండేవి. వీటితో పాటు పరిశ్రమలకు పవర్ హాలీడే లు వంటి పదాలు పేపర్లలో తరచూ వినిపించేవి. టీవీలు, సీరియళ్లు చూస్తున్న సమయంలో విద్యుత్తు కోతలు ఉంటే మన వాళ్లు వెంటనే స్థానిక కరెంట్ అధికారులును తిట్టి పోసేవారు. సహజంగా ఇది మన ఇళ్లలో జరిగిన అంశమే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉమ్మడి ఏపీ విభజన అనంతరం ఈ పదాలు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం కరెంట్ పోతే ప్రభుత్వాలను తిట్టుకునే స్టేజీకి ప్రజలు మారిపోయారు. అంతలా మార్పు వచ్చింది ప్రజల్లో. దీనిని ఒక రాజకీయ అంశjagan{#}local language;Elections;Telangana;Congress;media;Andhra Pradesh;CM;Jagan;Party;TDPఏపీ: జగన్‌కు ఊహించని విధంగా కరెంట్‌ దెబ్బ?ఏపీ: జగన్‌కు ఊహించని విధంగా కరెంట్‌ దెబ్బ?jagan{#}local language;Elections;Telangana;Congress;media;Andhra Pradesh;CM;Jagan;Party;TDPThu, 11 Apr 2024 08:27:00 GMTపదేళ్ల క్రితం గ్రామాల్లో, పట్టణాల్లో కరెంట్ కోతలు ఉండేవి. వీటితో పాటు పరిశ్రమలకు పవర్ హాలీడే లు వంటి పదాలు పేపర్లలో తరచూ వినిపించేవి. టీవీలు, సీరియళ్లు చూస్తున్న సమయంలో విద్యుత్తు కోతలు ఉంటే మన వాళ్లు వెంటనే స్థానిక కరెంట్ అధికారులును తిట్టి పోసేవారు. సహజంగా ఇది మన ఇళ్లలో జరిగిన అంశమే.


కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉమ్మడి ఏపీ విభజన అనంతరం ఈ పదాలు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం కరెంట్ పోతే ప్రభుత్వాలను తిట్టుకునే స్టేజీకి ప్రజలు మారిపోయారు. అంతలా మార్పు వచ్చింది ప్రజల్లో. దీనిని ఒక రాజకీయ అంశంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదు. అప్రకటిత విద్యుత్తు కోతలు ఉంటాయి అనే ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా పవర్ ముఖ్య కేంద్రంగానే జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంట్ కోతలు ఉంటాయని.. కరెంట్ కావాల్నా.. కాంగ్రెస్ కావాలా అని మాజీ సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.


ఇప్పుడు ఏపీ విషయానికొస్తే.. ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇది అసలే ఎండాకాలం. విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. ట్రాన్స్ ఫార్మర్లం మీద లోడ్ అధికంగా పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా కొన్ని చోట్ల, సబ్ స్టేషన్ల వద్ద కరెంట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీనిని సాకుగా చేసుకొని ప్రతిపక్షాలు వైసీపీని లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తున్నాయి.


దీనికి  ఎల్లో మీడియా అండగా నిలిచి కథనాలు ప్రచురిస్తోంది. మరోవైపు విద్యుత్తు శాఖలో కూడా టీడీపీ సానుభూతి పరులు ఉన్నారేమో అనిపిస్తోంది. వారు వైసీపీపై ద్వేషంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని.. కరెంట్ కోతలు ఎడాపెడా విధిస్తూ.. డిమాండ్ కు తగ్గ పవర్ సప్లై చేయించుకోక జనాలను ఇబ్బంది పెడుతున్నారు.  ఫలితంగా కొన్ని చోట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. పవర్ సాయంతో ప్రతిపక్షాలు జగన్ ని గద్దె దించే కుట్రలు జరుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతునన్నారు. మరి దీనిని జగన్ ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>