PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhuma-earigela-tdp-winb91d4482-57e8-41f0-b058-bfd1e37f52dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhuma-earigela-tdp-winb91d4482-57e8-41f0-b058-bfd1e37f52dc-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో ఆళ్లగడ్డ రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి.. అయితే ఈసారి మాత్రం ఆళ్లగడ్డ రాజకీయాలలో టిడిపి పార్టీ విజయం అందుకుంటుందా అంటే అవుననే సంకేతాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అయితే ఈసారి ఎన్నికల బరిలో ఇరిగెల , భూమా కుటుంబాలు కలిస్తే ఖచ్చితంగా విజయం పక్కా అన్నట్టు వినిపిస్తోంది.. గతంలో 1991లో భూమా నాగిరెడ్డి గెలుపు కోసం ఇరిగెల బై రెడ్డి కుమారులు అయిన ఇరిగెల బ్రదర్స్ కూడా సపోర్ట్ చేశారు.. దీంతో భూమా నాగిరెడ్డి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే సీనBHUMA;EARIGELA;TDP;WIN{#}dr rajasekhar;Telugu Desam Party;Bhuma Akhila Priya;Doctor;Husband;Allagadda;Father;Bhuma Nagi Reddy;Nandyala;Janasena;MLA;TDP;Reddyరాయలసీమ (ఆళ్లగడ్డ): ఒకటైన ఇరిగెల.. భూమా కుటుంబం.. గెలుపు ఖాయం..!!రాయలసీమ (ఆళ్లగడ్డ): ఒకటైన ఇరిగెల.. భూమా కుటుంబం.. గెలుపు ఖాయం..!!BHUMA;EARIGELA;TDP;WIN{#}dr rajasekhar;Telugu Desam Party;Bhuma Akhila Priya;Doctor;Husband;Allagadda;Father;Bhuma Nagi Reddy;Nandyala;Janasena;MLA;TDP;ReddyThu, 11 Apr 2024 10:15:42 GMTఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో ఆళ్లగడ్డ రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి.. అయితే ఈసారి మాత్రం ఆళ్లగడ్డ రాజకీయాలలో టిడిపి పార్టీ విజయం అందుకుంటుందా అంటే అవుననే సంకేతాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అయితే ఈసారి ఎన్నికల బరిలో ఇరిగెల ,  భూమా కుటుంబాలు కలిస్తే ఖచ్చితంగా విజయం పక్కా అన్నట్టు వినిపిస్తోంది.. గతంలో 1991లో భూమా నాగిరెడ్డి గెలుపు కోసం ఇరిగెల బై రెడ్డి కుమారులు అయిన ఇరిగెల బ్రదర్స్ కూడా సపోర్ట్ చేశారు.. దీంతో భూమా నాగిరెడ్డి మంచి విజయాన్ని అందుకున్నారు.


ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విజయం పైన కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా ఈసారి ఆళ్లగడ్డలో టిడిపి పార్టీనే విజయాన్ని అందుకుంటుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.. ఆయన తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇరువురు కుటుంబాలతో మాట్లాడి ఒక్కటి చేసినట్లుగా తెలుస్తోంది..


తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ  పొత్తులో భాగంగా ఆళ్లగడ్డ లోని తాలుకాకు జనసేన పార్టీ ఇన్చార్జ్ ఇరిగెల రామ పుల్లారెడ్డి. ఇరిగెల సోదరులను భూమా వారసురాలు అయిన  భూమా అఖిల ప్రియా రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా  ఉన్నారు.. అఖిల ప్రియా రెడ్డి భర్త భార్గవరాం నాయుడులతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చర్చలు కూడా విజయవంతంగా ముగిసాయట. దీంతో ఇరువురు ఒకటి కావడంతో ఆళ్లగడ్డలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా అఖిలప్రియ ఖచ్చితంగా గెలుస్తుందని ధీమాని వ్యక్తం చేస్తున్నారు. టిడిపి పార్లమెంట్ అభ్యర్థిగా బైరెడ్డి శబరి కి మంచి మెజారిటీ కూడా అక్కడ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. ఇన్ని రోజులు భూమా, ఇరిగెల కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ.. పొత్తులో భాగంగా టిడిపి పార్టీకి సపోర్టు చేస్తామని కూడా ఇరిగెల బ్రదర్స్ తెలియజేసినట్టు సమాచారం..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>