MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viswamb93a14c4-5746-4379-9902-a0e19a9bca9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viswamb93a14c4-5746-4379-9902-a0e19a9bca9a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన గోపీచంద్ శ్రీనువైట్ల డైరెక్షన్ లో విశ్వం అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైంది. విశ్వం ది ఫస్ట్ స్ట్రైక్ పేరుతో విడుదలైన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా విశ్వం గ్లింప్స్ ఉండగా గోపీచంద్ ఖాతాలో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చేరనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.viswam{#}chetan;Mass;Venu Thottempudi;Ramzan;vishwa;News;Population;srinu vytla;Heroine;Cinemaమాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా విశ్వం గ్లింప్స్ .. గోపీచంద్ బ్లాక్ బస్టర్ సాధిస్తారా?మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా విశ్వం గ్లింప్స్ .. గోపీచంద్ బ్లాక్ బస్టర్ సాధిస్తారా?viswam{#}chetan;Mass;Venu Thottempudi;Ramzan;vishwa;News;Population;srinu vytla;Heroine;CinemaThu, 11 Apr 2024 20:05:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన గోపీచంద్ శ్రీనువైట్ల డైరెక్షన్ లో విశ్వం అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైంది. విశ్వం ది ఫస్ట్ స్ట్రైక్ పేరుతో విడుదలైన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా విశ్వం గ్లింప్స్ ఉండగా గోపీచంద్ ఖాతాలో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చేరనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
గ్లింప్స్ లో గోపీచంద్ లుక్ గూస్ బంప్స్ వచ్చేలా ఉండగా చేతన్ భరద్వాజ్ బీజీఎంతో అదరగొట్టారు. రంజాన్ పండుగ సందర్భంగా రిలీజైన ఈ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా చిత్రాలయం స్టూడియోస్‌ పై వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం.
 
"దానే దానే పే లిఖా, ఖానే వాలే కా నామ్... ఇస్పే లిఖా మేరే నామ్" అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. శ్రీనువైట్ల ఫుల్ ఫామ్ లోకి వచ్చారని ఆయనకు ఈ సినిమాతో పూర్వ వైభవం వస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. గోపీచంద్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని గ్లింప్స్ తో అర్థమవుతోంది. గోపీచంద్ గ్లింప్స్ లో స్టైలిష్ గా కనిపించారు.
 
కేవీ గుహన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. గోపీమోహన్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్ కు కూడా ఢోకా ఉండదని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానుండగా హీరోయిన్ ఎవరనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా టైటిల్ విషయంలో గోపీచంద్ మరోమారు సున్నా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.

" style="height: 370px;">






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>