Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/coodrink6b8ce401-a100-4d96-a389-b489477f6c8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/coodrink6b8ce401-a100-4d96-a389-b489477f6c8b-415x250-IndiaHerald.jpgవిధి ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మల్లాంటివి మాత్రమే అని పెద్దలు చెబుతూ ఉంటే నేటి రోజుల్లో జనాలు అదంతా ట్రాష్ అని కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కొన్ని ఊహించని ఘటనలు ఏకంగా కుటుంబంలో విషాదం నింపుతూ ఉంటాయి. అనూహ్యమైన ఘటనలు ఎంతో మంది ప్రాణాలను చివరికి గాల్లో కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే విధి ఆడిన వింత నాటకంలోCoodrink{#}bhavana;Petrol;Parents;Nelloreకూల్ డ్రింక్ అనుకుని.. పెట్రోల్ తాగిన బాలుడు.. చివరికి?కూల్ డ్రింక్ అనుకుని.. పెట్రోల్ తాగిన బాలుడు.. చివరికి?Coodrink{#}bhavana;Petrol;Parents;NelloreThu, 11 Apr 2024 08:00:00 GMTవిధి ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మల్లాంటివి మాత్రమే అని పెద్దలు చెబుతూ ఉంటే నేటి రోజుల్లో జనాలు అదంతా ట్రాష్ అని కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కొన్ని ఊహించని ఘటనలు ఏకంగా కుటుంబంలో విషాదం నింపుతూ ఉంటాయి.  అనూహ్యమైన ఘటనలు ఎంతో మంది ప్రాణాలను చివరికి గాల్లో కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే విధి ఆడిన వింత నాటకంలో కొన్ని కొన్ని సార్లు అభం శుభం తెలియని చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు.



 ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన జరిగింది. సాధారణంగా చిన్నారులు ఎప్పుడూ ఏదో ఒక వస్తువుతో ఆడుకోవడం లాంటివి చేస్తుంటారు. ఏది మంచి ఏది చెడు అన్న విషయం వారికి తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు ఆడుకుంటున్న పిల్లలను ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం పనిలో పడి పిల్లలను మర్చిపోతుంటారు. ఇలాంటి సమయంలోనే ఊహించని ప్రమాదాలు చోటుచేసుకుని చివరికి పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. నెల్లూరులో ఇలాంటి విషాదకర ఘటన జరిగింది.


 దాహం వేయడంతో నీళ్లు తాగడానికి వెళ్ళాడు బాలుడు. కానీ అక్కడ కూల్ డ్రింక్ లాగా కనిపించిన పెట్రోల్ తాగి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. నెల్లూరు జిల్లాకు చెందిన కరీముల్లా, అమ్ములు దంపతులకు రెండేళ్ల కుమారుడు కాలేషా ఉన్నాడు. అమ్ములు స్థానికంగా ఉండే చేపల దుకాణంలో పనిచేస్తుంది. కుమారుడిని కూడా వెంట తీసుకెళ్తూ ఉండేది. అయితే ఇటీవల తల్లితోపాటు చేపల దుకాణానికి వెళ్లిన కాలేషా.. పెట్రోల్ బాటిల్ ని చూసి కూల్ డ్రింక్ అనుకుని తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అయితే గమనించిన తల్లి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లింది. కాగా అతను చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు అరణ్య రోదనగా విలపించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>