Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janaesnad705e939-264b-4ab5-bcb5-efd4ac9052d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janaesnad705e939-264b-4ab5-bcb5-efd4ac9052d7-415x250-IndiaHerald.jpgఅసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విధంగా వేడెక్కాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయ్. అయితే ఇప్పటికే ప్రచార రంగంలోకి దిగిన అభ్యర్థులందరూ.. తమను గెలిపిస్తే చేయబోయే అభివృద్ధి పనుల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. అదే సమయంలో అధికార పార్టీ చేసిన తప్పులను.. ఇచ్చి మరిచిపోయిన హామీలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ప్రచార రంగంలో అందరితో పోల్చి చూస్తే అటు జనసేన అధినేత పవన్ కళ్యాJanaesna{#}pithapuram;Congress;Assembly;Parliment;politics;kalyan;Janasena;Partyఏపీ : పవన్ కు సమస్యగా కొత్త గుర్తు.. అచ్చం గాజు గ్లాస్ లాగే ఉందే?ఏపీ : పవన్ కు సమస్యగా కొత్త గుర్తు.. అచ్చం గాజు గ్లాస్ లాగే ఉందే?Janaesna{#}pithapuram;Congress;Assembly;Parliment;politics;kalyan;Janasena;PartyThu, 11 Apr 2024 08:30:00 GMTఅసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు పచ్చ గడ్డి వేస్తే  భగ్గుమంటుంది అన్న విధంగా వేడెక్కాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయ్. అయితే ఇప్పటికే ప్రచార రంగంలోకి దిగిన అభ్యర్థులందరూ.. తమను గెలిపిస్తే చేయబోయే అభివృద్ధి పనుల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. అదే సమయంలో అధికార పార్టీ చేసిన తప్పులను.. ఇచ్చి మరిచిపోయిన హామీలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ప్రచార రంగంలో అందరితో పోల్చి చూస్తే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త ముందే ఉన్నారు.


  గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఒకచోట కూడా గెలవ లేకపోయిన పవన్ కళ్యాణ్ ఇక ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరీలోకి దిగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల తరఫున పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు. తనను ఒక్కసారి గెలిపించి చూడండి నేనేంటో చూపిస్తా అంటూ ఇక ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో జనసేనని పవన్ కళ్యాణ్ కు మాత్రం చిక్కులు తప్పడం లేదు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎన్నికల్లో ఓట్ల సంఖ్యను తగ్గించేలా మరో కొత్త చిక్కు వచ్చి పడింది అనేది తెలుస్తుంది.


 ప్రస్తుతం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీ గ్లాస్ గుర్తును పోలి ఉన్న బకెట్ గుర్తు జన సైనికులను ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఓటు వేయడానికి వెళ్ళిన వారు గాజు గ్లాస్ గుర్తు అనుకొని బకెట్ గుర్తుకు తమ ఓటు వేసే అవకాశం లేకపోలేదు. ఇక ఇది జనసేనకు వచ్చే ఓట్ల సంఖ్యను చీల్చే అవకాశం ఉంది. అయితే గుర్తు ఒకేలా ఉంటే ఏంటి కానీ పేరు చూసి ఓటు వేస్తారు అనుకున్న అక్కడ కొత్త చిక్కు ఏర్పడేలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు గాజు గుర్తు లాగే బకెట్ గుర్తు కనిపిస్తూ ఉండగా.. ఇంకోవైపు నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కనుమూరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బరిలోకి దిగిపోతున్నారు. అయితే అటు పవన్ కళ్యాణ్ కు కూడా కే అనే అక్షరమే ఇంటిపేరుగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంటిపేరు కొణిదెలా ఇక ఇప్పుడు కనుమూరి పవన్ కళ్యాణ్ కు కూడా కే అనే అక్షరం ఇంటి పేరుగా వచ్చే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>