PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-congress-leaders-congress-telangana-0d460e1c-fe3c-4b67-95ea-1f98a99b1e6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-congress-leaders-congress-telangana-0d460e1c-fe3c-4b67-95ea-1f98a99b1e6a-415x250-IndiaHerald.jpgమోసే వాళ్ళకే ఎరుక కావిడి బరువు అన్నట్టు.. సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీని గట్టెక్కించినటువంటి వ్యక్తులకే ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించింది నాయకులు కాదని, కింది స్థాయిలో ఉండే కార్యకర్తలే అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆయన అధికారంలోకి రాకముందు చాలాసార్లు ఎన్నో సభల్లో కార్యకర్తలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటామని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఏదైతే చెప్పారో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సRevanth reddy;congress leaders;congress;telangana;{#}Bhumika Chawla;Parliament;Revanth Reddy;Reddy;local language;June;Congress;Press;CM;Partyతెలంగాణ: రేవంత్ రెడ్డి కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారా..?తెలంగాణ: రేవంత్ రెడ్డి కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారా..?Revanth reddy;congress leaders;congress;telangana;{#}Bhumika Chawla;Parliament;Revanth Reddy;Reddy;local language;June;Congress;Press;CM;PartyThu, 11 Apr 2024 19:13:07 GMTమోసే వాళ్ళకే ఎరుక కావిడి బరువు  అన్నట్టు.. సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీని గట్టెక్కించినటువంటి వ్యక్తులకే  ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించింది నాయకులు కాదని, కింది స్థాయిలో ఉండే కార్యకర్తలే అని  రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆయన అధికారంలోకి రాకముందు చాలాసార్లు ఎన్నో సభల్లో  కార్యకర్తలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటామని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఏదైతే చెప్పారో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం అయినా కూడా చెప్పిన మాటను మార్చకుండా ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా  కార్యకర్తల గురించి తప్పక మాట్లాడుతున్నారు.  

తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీకైనా బలం, బలగం కార్యకర్తలే అని  వారిని కాపాడుకుంటేనే మనుగడ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో గత పది ఏళ్లలో చాలామంది సీనియర్ నాయకులు ఆధిపత్యం కోసం కొట్టుకున్నారు.  కార్యకర్తలను ఏ కోణంలో  కూడా పట్టించుకోలేదని అన్నారు.  పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేది కార్యకర్తలే అని, పార్టీలో సీనియర్ నాయకుల కంటే కార్యకర్తలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని తెలియజేస్తున్నారు.  రాబోవు లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కువ స్థానాలు గెలిచేలా క్యాడర్ ముందుకెళ్లాలని సూచించారు.

తప్పనిసరిగా కష్టపడే కార్యకర్తలకు జూన్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో  సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎంపీపీ,  స్థానాలకు  పార్టీ తరఫున పోటీ చేసే ఛాన్స్ దక్కించుకోవాలంటే తప్పక కష్టపడి పని చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా  ఎలాంటి పైరవీలు ఉండవని, అలాగే గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని, గ్రామంలో ఇలాంటి పని కావాలన్నా ఈ కమిటీ నిర్ణయం మేరికే జరుగుతుందని తెలియజేశారు. కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.కాబట్టి ప్రతి కార్యకర్త రాబోవు పార్లమెంటు ఎలక్షన్స్ లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు భారీ మెజారిటీ తీసుకువచ్చి గెలిపించాలని కోరారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>