PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-chandrababu-tdp-janasena8fcadbed-4e01-4ffa-bc41-0fae9443b41e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-chandrababu-tdp-janasena8fcadbed-4e01-4ffa-bc41-0fae9443b41e-415x250-IndiaHerald.jpgవైసీపీ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలంటూ టిడిపి అధినేత చంద్రబాబు నిన్నటి రోజున పిలుపునిచ్చారు.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించినటువంటి ఉమ్మడి ప్రచారంలో భాగంగా అటు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రచారాన్ని నిర్వహించారు.. ఈ ప్రచారంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తన సుఖవంతమైన జీవితాన్ని సైతం వదులుకొని ప్రజల కోసమే నిలబడ్డ నిజమైన హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ అభినందించారు. నాకు అనుభవం ఉంది .. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందంటూ తెలియజేశారు. ఈ ప్రజా గళానికి వారాహి తోడPAWAN;CHANDRABABU;TDP;JANASENA{#}Cycle;Hero;bhavana;kalyan;Janasena;Andhra Pradesh;District;Yevaru;CBN;Party;TDPటీడీపీ: పవన్.. చంద్రబాబు.. జోడీ ప్రచారంతో మైలేజ్ పెరుగుతోందా..?టీడీపీ: పవన్.. చంద్రబాబు.. జోడీ ప్రచారంతో మైలేజ్ పెరుగుతోందా..?PAWAN;CHANDRABABU;TDP;JANASENA{#}Cycle;Hero;bhavana;kalyan;Janasena;Andhra Pradesh;District;Yevaru;CBN;Party;TDPThu, 11 Apr 2024 08:05:29 GMTవైసీపీ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలంటూ టిడిపి అధినేత చంద్రబాబు నిన్నటి రోజున పిలుపునిచ్చారు.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించినటువంటి ఉమ్మడి ప్రచారంలో భాగంగా అటు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రచారాన్ని నిర్వహించారు.. ఈ ప్రచారంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తన సుఖవంతమైన జీవితాన్ని సైతం వదులుకొని ప్రజల కోసమే నిలబడ్డ నిజమైన హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ అభినందించారు. నాకు అనుభవం ఉంది .. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందంటూ తెలియజేశారు.


ఈ ప్రజా గళానికి వారాహి తోడైందంటే చాలు అహంకారాన్ని కూడా బూడిద చేస్తుంది అంటూ వెల్లడించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈ మూడు పార్టీలు ఏకమయ్యాయి.. సైకిల్ స్పీడ్ కు తిరుగులేదు.. గ్లాస్ జోరుకు ఎదురు లేదు వచ్చే ఎన్నికలలో కచ్చితంగా వైకాపా ప్రభుత్వాన్ని ఓడిస్తామంటూ మాట్లాడారు. పవన్ పైన ఎన్నో వ్యక్తిగత దాడులు జరిగాయి.. అవన్నీ తట్టుకొని నిలబడ్డారు .. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పడానికే ఆయన నిలబడ్డారు..ఇలాంటి చీకటి పాలన ఉండకూడదని పవన్ చెప్పారని చంద్రబాబు వెల్లడించారు.


విధ్వంశ పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలో? ఆలోచించండి అంటూ ప్రసంగాలలో మాట్లాడారు. రైతే రాజుగా చేసే బాధ్యత నాది.. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ మీద మొదటి సంతకం అంటూ వెల్లడించారు. వాలంటరీ వ్యవస్థ కూడా ఉంటుందని మీకు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు జీతం పెంచుతానంటూ చంద్రబాబు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి కల్పన పైన శ్రద్ధ పెడతామంటూ.. ఎవరు చెప్పినా నకిలీ మాట్లని నమ్మవద్దంటూ వెల్లడించారు.. అయితే ఇలాంటి ఉమ్మడి ప్రసంగాల విషయంతో టిడిపి పార్టీకి కాస్త మైలేజ్ పెరుగుతుందనే భావన కార్యకర్తలలో కనిపిస్తోంది. అలాగే జనసేన కార్యకర్తలు కూడా తమ పార్టీకి మరింత మైలేజ్ పెరిగేలా కనిపిస్తోందని నమ్ముతున్నారు. మరి ఈ మైలేజ్ తో ప్రజలని పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్తారేమో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>