PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-202459b290ca-d5ba-43df-b4c7-c6326bfab7cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-202459b290ca-d5ba-43df-b4c7-c6326bfab7cb-415x250-IndiaHerald.jpgఆమధ్య జనసేన అంటే ఏపీ ప్రజల్లో పాజిటివ్ వైబ్స్ ఉండేవి. కానీ ఏమంటూ టీడీపీతో పవన్ పొత్తుకున్నాడో అప్పటినుండి జనసేన పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మెల్లి మెల్లిగా జనసేన పార్టీ జనాల్లో నెగటివ్ వైబ్స్ తెచ్చుకుంటుంది. సరే పొత్తు పెట్టుకుంటే పెట్టుకుంది కానీ పొత్తులలో కూడా సీట్లు త్యాగం చేస్తోంది. బీజేపీకి అనకాపల్లి ఎంపీ సీటు కావాలన్నా విజయవాడ వెస్ట్ కావాలన్నా జనసేన పార్టీ నుంచే ఇవ్వాల్సి వస్తోంది. దీంతోనే జనసేన పార్టీలో ఉన్న వారు పవన్ పై కోపంతో రగులుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో కనీసం పదిహేనుAP Elections 2024{#}Balakrishna;Kaikaluru;రాజీనామా;Vijayawada;Eluru;Anakapalle;kalyan;Janasena;Andhra Pradesh;Party;Godavari Riverజనసేన: ఆ తప్పుతో పాతాలానికి పోతుందిగా?జనసేన: ఆ తప్పుతో పాతాలానికి పోతుందిగా?AP Elections 2024{#}Balakrishna;Kaikaluru;రాజీనామా;Vijayawada;Eluru;Anakapalle;kalyan;Janasena;Andhra Pradesh;Party;Godavari RiverWed, 10 Apr 2024 14:29:26 GMTఆమధ్య జనసేన అంటే ఏపీ ప్రజల్లో పాజిటివ్ వైబ్స్ ఉండేవి. కానీ ఏమంటూ టీడీపీతో పవన్ పొత్తుకున్నాడో అప్పటినుండి జనసేన పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మెల్లి మెల్లిగా  జనసేన పార్టీ జనాల్లో నెగటివ్ వైబ్స్ తెచ్చుకుంటుంది. సరే పొత్తు పెట్టుకుంటే పెట్టుకుంది కానీ పొత్తులలో కూడా సీట్లు త్యాగం చేస్తోంది. బీజేపీకి అనకాపల్లి ఎంపీ సీటు కావాలన్నా విజయవాడ వెస్ట్ కావాలన్నా జనసేన పార్టీ నుంచే ఇవ్వాల్సి వస్తోంది. దీంతోనే జనసేన పార్టీలో ఉన్న వారు పవన్ పై కోపంతో రగులుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో కనీసం పదిహేను సీట్లకు తక్కువ కాకుండా వస్తాయని అందులో చాలా సీట్లలో బలమైన నేతలకు దక్కుతాయనుకుంటే అసలు వీలు పడలేదు. అందుకే చాలా మంది జనసేన పార్టీని వీడిపోతున్నారు.ఇలా చూసుకుంటే ముమ్మిడివరం, అమలాపురంలలో నియోజకవర్గం ఇంచార్జీలుగా పనిచేసిన పితాని బాలకృష్ణ ఇంకా శెట్టిబత్తుల రాజబాబు జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. అలాగే ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బీవీ రావు కూడా పార్టీకి గుడ్ బై కొట్టేశారు. విజయవాడ పశ్చిమ ఇంచార్జి పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ ని తిట్టి మరీ రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయాడు.


వీరి తరువాత కూడా వరసలో మరింతమంది నేతలు ఉన్నారు. దానికి కారణం జనసేన అధినాయకత్వం స్వీయ తప్పిదాలే. ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ అవసరం టీడీపీకే ఉంది. పట్టుబట్టి కనీసం నలభై సీట్లు సాధించి అందులో పార్టీ కోసం కష్టపడిన వారిని దించితే  లెక్క బాగుండేది కానీ అలా చేయలేదు.దానికి తోడు టీడీపీతో పొత్తు మరో పదేళ్ళ పాటు ఉండాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పడంతో ఇక ఈ పార్టీలో ఇంతేనా అన్న డౌట్లను కలుగచేశారు. తెలుగుదేశంతో పొత్తు అంటే మిత్రపక్షాలు ఎక్కడా బతికి బట్ట కట్టలేదని అంటారు. ఇక జనసేన టికెట్లలో పోటీ చేస్తున్న మాజీ తమ్ముళ్ళు గెలిస్తే ఎక్కడ ఉంటారో కష్టకాలం వస్తే జెండా ఏ వైపు ఎత్తుతారో కూడా  రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి తెలిసిన సంగతే.ఇవన్నీ చూసిన వారు జనసేన పార్టీలో భవిష్యత్తు కష్టం అనుకుని జారుకుంటున్నారు. అయితే కొందరు నేతలు ఇంకా జనసేనలో ఉన్నారు రేపటి రోజున కూటమి అధికారంలోకి రాకపోతే వారు కూడా జారుకోవడం పక్కా అని తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>