MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pushpa-2c44de55c-6809-4b47-9de5-4f2fda1976c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pushpa-2c44de55c-6809-4b47-9de5-4f2fda1976c9-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న పుష్ప టీజర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. ఐదు రోజుల ముందు నుంచి టీజర్ పై రెగ్యులర్ అప్డేట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం గట్టిగా చేశారు. దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ మూవీపై భారీ హైప్ నెలకొని ఉంది. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషలలో పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సుకుమార్ పుష్ప ది రూల్ టీజర్ ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి ముందే అందరిలో అంచనాలను అమాంతం పెంచింది.Pushpa 2{#}KGF;Prabhas;Hindi;Allu Arjun;Audience;Cinema;sukumarపుష్ప2 టీజర్: రికార్డ్స్ సరిపోలే.. 1000 కోట్లు డౌటే?పుష్ప2 టీజర్: రికార్డ్స్ సరిపోలే.. 1000 కోట్లు డౌటే?Pushpa 2{#}KGF;Prabhas;Hindi;Allu Arjun;Audience;Cinema;sukumarWed, 10 Apr 2024 18:24:18 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న పుష్ప టీజర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. ఐదు రోజుల ముందు నుంచి టీజర్ పై రెగ్యులర్ అప్డేట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం గట్టిగా చేశారు. దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ మూవీపై భారీ హైప్ నెలకొని ఉంది. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషలలో పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సుకుమార్ పుష్ప ది రూల్ టీజర్ ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి ముందే అందరిలో అంచనాలను అమాంతం పెంచింది. దానికి తగ్గట్లుగానే గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ లో షూట్ చేసిన ఫైట్ సీక్వెన్స్ ని టీజర్ గా రిలీజ్ చేశారు.ఇక ఈ టీజర్ కి అనూహ్య స్పందన వచ్చింది. జాతరలో చీరకట్టులో అల్లు అర్జున్ యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉందనే మాట ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. కచ్చితంగా ఈ టీజర్ రికార్డులని తిరగరాస్తుందని అంతా భావించారు. అయితే 24 గంటల్లో పుష్ప ది రూల్ టీజర్ కేవలం 39.6 మిలియన్ వ్యూవ్స్ మాత్రమే సొంతం చేసుకుంది. 24 గంటల్లో అత్యధిక వ్యూవ్స్ సాధించిన మూవీ టీజర్స్ జాబితాలో ఈ సినిమా ఐదో స్థానంలో ఉంది.


మొదటి స్థానంలో ప్రభాస్ సినిమా సలార్ ఉంది. ఈ మూవీ టీజర్ ని 24 గంటల్లో ఏకంగా 83 మిలియన్స్ మంది వీక్షించారు. రెండో స్థానంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా నిలిచింది. దీనిని మొత్తం 68.96 మిలియన్స్ మంది ఆడియన్స్ వీక్షించడం విశేషం. మూడో స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా టీజర్ ఉంది. ఈ టీజర్ 24 గంటల వ్యవధిలో 68.83 మిలియన్స్ వ్యూవ్స్ ని సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ టీజర్ కు 24 గంటల్లో మొత్తం 42.66 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఇక దీని తర్వాత స్థానంలో పుష్ప ది రూల్ సినిమా ఉంది. హైయెస్ట్ వ్యూవ్స్ సొంతం చేసుకున్న టాప్ 5 సినిమాలలో మూడు సినిమాలు ప్రభాస్ వే కావడం విశేషం. అయితే బన్నీ పుష్ప టీజర్ కూడా టాప్ రికార్డులను బ్రేక్ చేస్తుందని అనుకుంటే కనీసం రాధేశ్యామ్ రికార్డును కూడా అందుకోలేకపోయింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల టార్గెట్ ను టచ్ చేయాలని అనుకుంటున్న మేకర్స్ కు కొంత వరకు ఇది షాక్ ఇచ్చింది. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ టాప్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయాలంటే ఈ సౌండ్ సరిపోదు అనేలా కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక లైక్స్ పరంగా కూడా 24 గంటల్లో 1 మిలియన్ దాటినా kgf 2, సలార్, మాస్టర్, రికార్డులని బద్దలు కొట్టలేకపోయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>