Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl5a15f9b5-2d7b-432a-8f99-b2c92daab9d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl5a15f9b5-2d7b-432a-8f99-b2c92daab9d1-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందడం ఖాయం. అందుకే ఐపీఎల్ ను ఏకంగా క్రికెట్ పండగ అని పిలుచుకుంటూ ఉంటారు భారత క్రికెట్ ప్రేక్షకులు. ఇక మరోవైపు ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ ఎంటర్టైన్మెంట్ను పంచడమే కాదు ఎంతో మంది యువ ఆటగాళ్లకు సరికొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అప్పటివరకు దేశవాళి క్రికెట్లో రాణిస్తూ వచ్చిన ఆటగాళ్ళకు ఇక ఐపీఎల్లో సత్తా చాటుకునే ఛాన్స్ కల్పిస్తుంది. ఐపిఎల్ లో ఆటగాళ్లు ఇక వారికి తక్కువ సమయంలోనే జాతీయ జట్టులో కూడIpl{#}Mumbai;Audi;Nitish Kumar;Vishakapatnam;Dookudu;Cricket;Yuva;Ram Gopal Varma;Punjab;Teluguసన్రైజర్స్ గెలిపించిన తెలుగు క్రికెటర్.. ఇంతకీ ఎవరీ నితీష్ రెడ్డి?సన్రైజర్స్ గెలిపించిన తెలుగు క్రికెటర్.. ఇంతకీ ఎవరీ నితీష్ రెడ్డి?Ipl{#}Mumbai;Audi;Nitish Kumar;Vishakapatnam;Dookudu;Cricket;Yuva;Ram Gopal Varma;Punjab;TeluguWed, 10 Apr 2024 12:00:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందడం ఖాయం. అందుకే ఐపీఎల్ ను ఏకంగా క్రికెట్ పండగ అని పిలుచుకుంటూ ఉంటారు భారత క్రికెట్ ప్రేక్షకులు. ఇక మరోవైపు ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ ఎంటర్టైన్మెంట్ను పంచడమే కాదు ఎంతో మంది యువ ఆటగాళ్లకు సరికొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అప్పటివరకు దేశవాళి క్రికెట్లో రాణిస్తూ వచ్చిన ఆటగాళ్ళకు ఇక ఐపీఎల్లో సత్తా చాటుకునే ఛాన్స్ కల్పిస్తుంది. ఐపిఎల్ లో ఆటగాళ్లు ఇక వారికి తక్కువ సమయంలోనే జాతీయ జట్టులో కూడా చూస్తూ ఉంటాం.


 ఇలా ప్రతి ఐపీఎల్ సీజన్లో కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉంటారు. ఏకంగా భారత సెలక్టర్ల చూపును ఆకర్షించి టీమిండియాలోకి వచ్చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఆట తీరుతోనే వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు ఒక తెలుగు క్రికెటర్. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి తిలక్ వర్మ ఎలా అయితే టీమిండియాలో ఛాన్స్ దక్కించుకున్నాడో.. ఇక ఇప్పుడు మరో తెలుగు క్రికెటర్ ఇలా భారత జట్టులోకి వచ్చేలాగా కనిపిస్తున్నాడు. అతను ఎవరో కాదు నితీష్ కుమార్ రెడ్డి.



 ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇక జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్లందరూ కూడా విఫలమైన సమయంలో 37 బంతుల్లోనే 64 పరుగులు చేసి అదరగొట్టాడు ఈ తెలుగు అబ్బాయి. సన్రైజర్స్ జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. వైజాగ్ కు చెందిన నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర తరపున రంజీ క్రికెట్ ఆడుతున్నాడు. స్వింగ్ బౌలింగ్, దూకుడు అయిన బ్యాటింగ్ మెరుపు ఫీల్డింగ్  అతని సొంతం. గడిచిన రంజి సీజన్లో రహానే, అయ్యర్ లాంటి ప్లేయర్లను తన బౌలింగ్లో అవుట్ చేశాడు నీతీష్ కుమార్. అయితే ఇతను టీమిండియా కు ఫ్యూచర్ స్టార్ అవుతాడని మరో తెలుగు క్రికెటర్ విహారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ప్రశంసించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>