PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-annaya-eachina-viralam-panikirakunda-poyendaa084021ae-c1e1-41d2-b439-9f79ac83db81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-annaya-eachina-viralam-panikirakunda-poyendaa084021ae-c1e1-41d2-b439-9f79ac83db81-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పెట్టి ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు అవుతున్నా.. అనుకున్నంత స్థాయిలో ఎదగలేకపోతున్నారు.. అయితే అందుకు ముఖ్య కారణం ఆ పార్టీ నడిపించడానికి అందుకు తగ్గట్టుగా డబ్బులు లేవని.. ఇప్పటికే ఎన్నోసార్లు విరాళాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. కార్యకర్తలను నేతలను ఆన్లైన్ ద్వారా కూడా పేమెంట్ చేయమని గతంలో నాగబాబు తెలియజేశారు. ఇప్పుడు తాజాగా గడిచిన రెండు రోజుల క్రితం చిరంజీవి రూ .5 కోట్ల రూపాయలను విరాళము కూడా అందించారు.. ఇలా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి డబ్బులు ఇచ్చారో లేదో సోషల్ PAWAN;CHIRU;JANASENA{#}Chiranjeevi;Ram Charan Teja;kalyan;Jagan;Janasena;media;News;Tammudu;Nagababu;Thammudu;Cinema;Yevaru;Partyపవన్: అన్నయ్య ఇచ్చిన విరాళం పనికిరాకుండా పోయిందా..?పవన్: అన్నయ్య ఇచ్చిన విరాళం పనికిరాకుండా పోయిందా..?PAWAN;CHIRU;JANASENA{#}Chiranjeevi;Ram Charan Teja;kalyan;Jagan;Janasena;media;News;Tammudu;Nagababu;Thammudu;Cinema;Yevaru;PartyWed, 10 Apr 2024 06:50:24 GMTపవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పెట్టి ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు అవుతున్నా.. అనుకున్నంత స్థాయిలో ఎదగలేకపోతున్నారు.. అయితే అందుకు ముఖ్య కారణం ఆ పార్టీ నడిపించడానికి అందుకు తగ్గట్టుగా డబ్బులు లేవని.. ఇప్పటికే ఎన్నోసార్లు విరాళాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. కార్యకర్తలను నేతలను ఆన్లైన్ ద్వారా కూడా పేమెంట్ చేయమని గతంలో నాగబాబు తెలియజేశారు. ఇప్పుడు తాజాగా  గడిచిన రెండు రోజుల క్రితం చిరంజీవి రూ .5 కోట్ల రూపాయలను విరాళము కూడా అందించారు..


ఇలా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి డబ్బులు ఇచ్చారో లేదో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ని బాగా పొగిడేశారు. చాలామంది అధికారంలోకి వచ్చిన తర్వాత సహాయం చేస్తారు కానీ తన తమ్ముడు కష్టపడిన డబ్బుని రైతుల కోసం వినియోగించడం చాలా ఆనందాన్ని కలిగించిందని.. తన స్వార్ధాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసు ఉండడం తనకు చాలా ఆనందంగా ఉందంటూ.. తన తమ్ముడిని చిరంజీవి పొగడ్తలతో ముంచేశారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా చిరంజీవి చెప్పినా ఈ మాటలు అంతస్థాయిలో పాపులర్ కాలేదు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కాబట్టి కాస్త రియాక్షన్ ఎక్కువగా ఉండాలి. సోషల్ మీడియాలో అయితే ఇలాంటి హడావిడి ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు.



దీంతో జనసేన చిరు అభిమానులు చాలా లైట్ గా తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి అందుకు కారణం.. చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ ప్రచారానికి పిఠాపురానికి వెళ్లలేదు. దీంతో అటు పవన్ అభిమానులు కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు.. ఎన్నో సందర్భాలలో చిరంజీవి తన తమ్ముడి రాజకీయ ప్రస్తానాన్ని మెచ్చుకున్నప్పటికీ.. పవన్ కోసం ప్రచారానికి వచ్చేంత సాహసం అయితే ఇప్పటివరకు మెగాస్టార్ చేయలేదు. ఒకవేళ వస్తే కచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని తిట్టాల్సి.. విమర్శించాల్సి ఉంటుంది. రాజకీయాలకు దూరంగా ఉన్నా చిరంజీవి తన తమ్ముడి కోసం ఇతర రాజకీయాలతో ఎలాంటి శత్రుత్వం పెట్టుకోవాలనే ఆలోచనలు లేకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చాలామంది ఈ విరాళం ఇచ్చినా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. చిరంజీవి ట్వీట్ చేశారంటే అందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ విశ్వంభర సినిమా షూటింగ్ కి వెళ్లి అక్కడ చిరంజీవి కాళ్లకు నమస్కారం చేయడం.. ఆ వెంటనే ఐదు కోట్లు చెక్కు ఇవ్వడం వంటివన్నీ పెద్దగా ఎఫెక్ట్ పడలేదు.. పైగా ఈ విషయంపైన సెలబ్రిటీలు కూడా ఎవరు స్పందించలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>